Movie News

రామ్ చరణ్ 17… అడుగులు పడుతున్నాయి

పెద్ది వచ్చి నాలుగు నెలలవుతోంది. దానికన్నా ముందు రామ్ చరణ్ కున్న గ్యాప్ సంవత్సరంన్నర. అందుకే ఆర్సి 17 కోసం అభిమానులు పడిగాపులు కాస్తున్నారు. దర్శకుడు సుకుమార్ వర్కింగ్ స్టయిల్ తెలిసిందే కాబట్టి ఇప్పుడు మొదలుపెడితే కనీసం 2028లో రిలీజ్ అవుతుందని అంచనా పెట్టుకోవచ్చు. ఇంకా లేట్ అయితే ఎదురు చూపులు మరింత ఎక్కువవుతాయనే భయం ఫ్యాన్స్ లో లేకపోలేదు. ఎందుకంటే స్క్రిప్ట్ వర్క్ చాలా కాలంగా జరుగుతూనే ఉంది కాబట్టి.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆర్సి 17 స్క్రిప్ట్ లాకయ్యిందట. అన్ని చెక్ చేసుకుని తుది మెరుగులు దిద్దాక సుకుమార్ తన బృందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది. ఫైనల్ నేరషన్ రామ్ చరణ్ కు చెప్పి ఓకే అనిపించుకున్నాక సెట్స్ పైకి వెళ్లిపోవడమే ఆలస్యం. డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలుపెట్టేలా ఏర్పాట్లు జరుగుతున్నాయట. దసరాకు పూజా కార్యక్రమాలు చేసే అవకాశాలున్నాయి. మైత్రి నిర్మాతలు హీరో దర్శకుడి మాట కోసం వెయిట్ చేస్తున్నారు.

రంగస్థలం లాగా పల్లెటూరి నేపథ్యం కాకుండా సుకుమార్ ఈసారి సిటీకి షిఫ్ట్ అవుతున్నారు. లీక్ సోర్స్ ప్రకారం 1 నేనొక్కడినేలో జరిగిన పొరపాట్లను సవరించుకుని నగరం నేపథ్యంలో పుష్ప ట్రీట్ మెంట్ తో హీరోని ప్రెజెంట్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో స్టోరీ డెవలప్ చేశారట. ఏదో గ్యాంగ్ స్టర్ డ్రామాలానో మాఫియా ఫార్ములానో కాకుండా కొత్త సెటప్ డిజైన్ చేసుకున్నట్టు తెలిసింది. ఇంట్రో నుంచి క్లైమాక్స్ దాకా అదిరిపోయే ఎపిసోడ్స్ కుదిరాయని వినికిడి.

హీరోయిన్ ఎవరు కన్ఫర్మ్ అయ్యాయో ఇంకా బయటికి రాలేదు. రష్మిక మందన్న నుంచి సారా అర్జున్ దాకా ఏవేవో పేర్లు వినిపిస్తున్నాయి. సంగీత దర్శకత్వం దేవిశ్రీ ప్రసాద్ చేయడం లేదనేది దాదాపు పక్కా. తన స్థానంలో సాయి అభ్యంక్కర్ వస్తారా లేక దురంధర్ ఫేమ్ శాశ్వత్ సచ్ దేవ్ ఉంటారానేది టీమ్ అధికారికంగా రివీల్ చేయడం లేదు. రెండో పేరే ఫైనల్ కావొచ్చేమో. ఆర్సి 17 కోసం రామ్ చరణ్ కొత్త మేకోవర్ చేసుకోబోతున్నాడు. హెయిర్ స్టయల్, కాస్ట్యూమ్స్ అన్నీ డిఫరెంట్ గా ఉండబోతున్నాయి. 

This post was last modified on September 7, 2026 1:07 pm

Share

Recent Posts

ఇరుముడి వేట అయిపోలేదు స్వామి

ప్యారడైజ్ వచ్చేసింది కాబట్టి వేరే ఏ సినిమాలకు జనాలు లేరనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఓటిటిలో వచ్చాక కూడా ఇరుముడి ఇంకా…

3 hours ago

బాలయ్య మనసు మారితే బాక్సాఫీస్ యుద్ధమే

డిసెంబర్ 25 క్రిస్మస్ పండక్కు రిలీజ్ కావాల్సిన దాదా మళ్ళీ వాయిదా పడుతుందనే అనుమానాలు ఫిలిం నగర్ వర్గాల్లో మొదలయ్యాయి.…

3 hours ago

రణబాలి తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త

సోషల్ మీడియా రాను రాను మరీ తీవ్రంగా మారిపోతోంది. ప్యారడైజ్ బాగుందా లేదానేది పక్కనపెడితే బెనిఫిట్ షో అయిన దగ్గరి…

6 hours ago

RTO ఆఫీసుకు వెళ్లకుండానే LLR… టెస్ట్‌లో AI నిఘా!

డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. లెర్నర్ లైసెన్స్ కోసం ఇప్పటివరకు స్లాట్ బుక్…

8 hours ago

పాపం అల్లు శిరీష్.. ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది

సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి. ఏదైనా పని జరగాలి, మెసేజ్ జనానికి చేరాలి అంటే.. దీని ద్వారా…

8 hours ago

ట్విస్ట్…. నారాయణమ్మకు మూలం నవనీతమ్మ ?

నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 నుంచి విడుదలైన నారాయణమ్మ పాట సోషల్ మీడియాలో డిస్కషన్ కు దారి తీస్తోంది.…

9 hours ago