Political News

ఇప్పుడు ఎంత ఏడ్చినా ఏం లాభం?

అడుసు తొక్కనేల…కాలు కడగనేల..అనే సామెతను పెద్దలు ఊరికే వేయలేదు. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారు, రాజకీయ నేతల కుటుంబ సభ్యులు రాజకీయాల గురించి ఆచితూచి మాట్లాడాలి. కానీ, మాజీ మంత్రి కొండా సురేఖ తనయురాలు సుష్మిత మాత్రం సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించినట్లు కనిపించలేదు.

పోనీ ఆ వ్యాఖ్యలపై దుమారం రేగినప్పుడు కూడా సుష్మిత తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు కనిపించలేదు. కట్ చేస్తే కేవలం సుష్మిత వివాదాస్పద వ్యాఖ్యలు వల్ల సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు.

దీంతో, ఇప్పుడు సుష్మిత కన్నీటి పర్యంతమవుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. అయితే, కొండా సురేఖకు జరిగిన అవమానం జీర్ణంచుకోలేకపోతున్నా… తాను మాట్లాడిన మాటలకు తన తల్లిని బలి చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ సుష్మిత ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ దయ వల్ల సాధారణ కాంగ్రెస్ కార్యకర్త నుంచి ఈ స్థాయికి సురేఖ వచ్చారని అన్నారు. అటువంటి వ్యక్తిని రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నారని ఆమె ఆరోపించారు.

తన తల్లిదండ్రులు ఎన్నో కేసులు ఎదుర్కొన్నారని, ఎన్నోసార్లు జైలుకు వెళ్లారని చెప్పారు. రేవంత్ రెడ్డి తన తల్లిపై ఎంతో పగపెట్టుకున్నారని ఆరోపించారు. తన వ్యాఖ్యలు తన తల్లిని ఇంత ఇబ్బందులకు గురి చేస్తాయని తాను కలలో కూడా ఊహించలేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎంత ఏడ్చినా ఏం ప్రయోజనం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సుష్మిత సంగతి పక్కనబెడితే…సురేఖ అయినా తన కూతురు చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని, ఆ వ్యాఖ్యలను ఖండించలేదని అంటున్నారు.

This post was last modified on September 6, 2026 3:23 pm

Share

Recent Posts

ఫోన్ కోసం పుట్టిన పసికందునే అమ్మేశారు

ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే…

36 minutes ago

జూనియర్ ఇచ్చిన జోష్ సరిపోతుందా

ఎల్లుండి విడుదల కాబోతున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రమోషన్ల ఘట్టం చివరి అంకాన్ని నిన్న దిగ్విజయంగా పూర్తి చేశారు.…

42 minutes ago

పార్టీ క‌న్నా ప‌రువు కాపాడుకునేదెలా…

కొంతమంది నాయకుల విషయంలో పార్టీ ముందు.. తర్వాత నాయకులు.. అనే మాట వినిపిస్తుంది. నిజంగా రాజకీయాల్లో కొత్తగా వచ్చినవారు యువతరం…

53 minutes ago

విజయవాడలో 10 కోట్లు… దేశంలోనే మొదటిసారి

సైబ‌ర్ నేరాల గురించి త‌ర‌చుగా వార్త‌లు వ‌స్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్ర‌భుత్వాలు స‌హా రిజ‌ర్వ్ బ్యాంకు…

2 hours ago

ఒక్క యాడ్‌కు 40 కోట్ల పారితోష‌కం?

చాలా ఏళ్ల నుంచి త‌మిళ సినిమాను ఏలుతున్న హీరోల్లో అజిత్ ఒక‌డు. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్, ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌ర్వాత…

2 hours ago

ఖైర‌తాబాద్‌లో బీజేపీ క్యాండేట్‌ ఆయ‌నేనా?

తెలంగాణ‌లో కీల‌క‌మైన ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుద‌ల…

6 hours ago