ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సూపర్ ప్లాన్ వేశారు. ఇప్పటి వరకు రాష్ట్రం, జిల్లాల వరకు మాత్రమే పరిమితం చేసిన `విజన్`ను ఇక నుంచి నియోజకవర్గాల వారీగా అమలు చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి గతం నుంచి ఇప్పటి వరకు కూడా సీఎం చంద్రబాబు పదేళ్ల ముందటి భవిష్యత్తును అంచనా వేసి.. దాని ప్రకారం విజన్‌ను రెడీ చేసుకుంటారు. ఈ క్రమంలోనే గతంలో `విజన్-2020` ప్రకటించారు. ఆ తర్వాత.. `స్వర్ణాంధ్ర-2040` తాజాగా `స్వర్ణాంధ్ర-2047` అమలుకు శ్రీకారం చుట్టారు. అలానే జిల్లాలకు కూడా ప్రత్యేక విజన్ ఉండాలని నిర్ణయించారు.
ఇక, ఇప్పుడు తాజాగా.. నియోజకవర్గాల వారీగా విజన్‌ను అమలు చేయాలని నిర్దేశించారు. పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో శుక్రవారం రాత్రి పాల్గొన్న చంద్రబాబు.. స్థానిక సంస్థల ఎన్నికలు, కూటమి ఎలా వ్యవహరించాలి? ముఖ్యంగా ప్రజలను ఈ ఎన్నికల విషయంలో ఏవిధంగా ఆకట్టుకోవాలి? అనే అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో రాష్ట్రం-జిల్లాలతో పాటు.. నియోజకవర్గాల వారీగా కూడా విజన్ ఏర్పాటు చేసుకుని దానిని సాధించే దిశగా అడుగులు వేయాలన్నారు. వచ్చే మూడు సంవత్సరాలు విజన్‌పైనే దృష్టి పెట్టాలన్నారు.
ఏం చేస్తారు?
రాష్ట్రానికి సంబంధించి విజన్ ఉన్నట్టుగానే నియోజకవర్గాల వారీగా కూడా.. పదేళ్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు, స్థానికంగా జనాభాను పెంచడం, ఉపాధి, ఉద్యోగాలు వంటి అంశాలతో ప్రత్యేక విజన్‌ను రెడీ చేసుకోవాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో రహదారులు, ప్రాజెక్టులు, తాగునీటి కల్పనకు ప్రాధాన్యం ఉండేలా చూసుకోవాలన్నారు. అలానే వచ్చే 10 సంవత్సరాలకు నియోజకవర్గంలో ఎలాంటి అవసరాలు కావాలి.. ప్రజలకు అందించాల్సిన సౌకర్యాలపై రోడ్ మ్యాప్ రెడీ చేసుకుని ఎమ్మెల్యేలు సన్నద్ధం కావాలని చంద్రబాబు ఆదేశించారు.
మళ్లీ మనమే!
మళ్లీ కూటమి పాలనే రాష్ట్రంలో వస్తుందని చంద్రబాబు భరోసా వ్యక్తం చేశారు. కొందరు ఎమ్మెల్యేలు దీనిపై నిర్లక్ష్యంగా ఉన్నారని .. పార్టీ అధిష్టానంపై ఆధారపడడం కాకుండా.. వ్యక్తిగతంగా కూడా చేరువ అయ్యేందుకు ప్రయత్నించాలన్నారు. ప్రజలకు చేరువ కాకుండా.. పార్టీనే అన్నీ చూసుకుంటుందని భావిస్తే కష్టమని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో మనమే వస్తున్నామన్న ధీమా మంచిదే అయినా.. ఆమేరకు ప్రజలను మనవైపు తిప్పుకొనేందుకు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. “మనం ఒక రాక్షస మూకతో యుద్ధం చేస్తున్నామన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి.“ అని సూచించారు.
This post was last modified on September 5, 2026 8:31 am
తెలంగాణలో కీలకమైన ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వరలోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల…
మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…
ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…
కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…
2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…
ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…