Political News

ఏకగ్రీవాలందు జగన్ ఏకగ్రీవాలు వేరయా!

త్వరలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగబోతోంది. ఈ లోకల్ వార్ లో ఫైట్ కు ఇటు కూటమి పార్టీలు..అటు వైసీపీ రెడీ అవుతున్నాయి. అయితే, ఏకగ్రీవాలు జరిగిన నియోజకవర్గంలో అక్కడి వైసీపీ ఇంఛార్జ్ కు రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని వైసీపీ అధినేత జగన్ తేల్చి చెప్పారు. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో జగన్ పై సొంత పార్టీలో సైతం విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యన్నారాయణ స్పందించారు.

ఊళ్లలో వైసీపీ హయాంలోనూ ఏకగ్రీవాలు జరిగాయని, ఇప్పుడు కూడా జరుగుతాయని బొత్స చెప్పారు. అయితే, అవి ప్రభుత్వాలు చేసే ఏకగ్రీవాలు అని, పార్టీల పరంగా, రాజకీయ లబ్ధి కోసం ఏకగ్రీవాలు జరగకూడదని జగన్ చెప్పారని స్పష్టం చేశారు.

ఊరు అభివృద్ధి కోసం జరిగే ఏకగ్రీవాలు, రాజకీయపరంగా లాలూచీ పడే ఏకగ్రీవాలు..ఇవి రెండూ వేరని అన్నారు. అధికార పార్టీ ప్రలోభ పెట్టి, వ్యవస్థలను, పోలీసులను అడ్డుపెట్టుకొని జరిపే ఏకగ్రీవాలకు వైసీపీ వ్యతిరేకం అని చెప్పారు. వాటికి భయపడకూడదని, పోరాడాలని జగన్ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం అని తెలిపారు.

వాస్తవానికి, వైసీపీ హయాంలో జరిగిన ఏకగ్రీవాలన్నీ భయపెట్టి, లాలూచి పడి చేసినవేనని విమర్శలు వచ్చాయి. టీడీపీ అభ్యర్థులను గదుల్లో పెట్టి తాళాలు వేసి నామినేషన్ వేయకుండా చేసిన ఘటనలు కోకొల్లలు. అటువంటిది, ఇప్పుడు మాత్రం ఏకగ్రీవాలు జరగకూడదు అని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉంది. న్యూటన్ థర్డ్ లా ప్రకారం ప్రతీ చర్యకు ప్రతి చర్య ఉంటుంది అన్న విషయం జగన్ మరచిపోయినట్లున్నారు.

This post was last modified on August 30, 2026 7:00 pm

Share

Recent Posts

టాలీవుడ్ స్టార్లు ఆ మాయలో పడి నష్టపోతున్నారా

మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…

3 hours ago

అబ్బవరం ఈసారి బయటపడగలడా?

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…

4 hours ago

అసలు ఈ మస్క్ వివాదం ఏంటి?

గ‌త రెండు రోజులుగా ఇటు సోష‌ల్ మీడియాలోను, అటు ప్ర‌ధాన మీడియా ఛానెళ్ల‌లోను.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. ప్ర‌పంచ…

9 hours ago

బడ్జెట్ రూ. 2 కోట్లు కలెక్షన్లు 50 కోట్లు…

పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…

10 hours ago

కొడతావా… కొట్టుకో

ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనతో దేశ…

10 hours ago

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

13 hours ago