Political News

అలిగి వెళ్ళిపోయిన ఎమ్మెల్యే దానం నాగేందర్

ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ అలిగారు. డబుల్ బెడ్ రూం లక్కీ డ్రా కార్యక్రమం నుంచి మధ్యలోనే వెళ్ళిపోయారు. నిన్నటి వరకు కొండా సురేఖ, చిన్నా రెడ్డి తలనొప్పితో అధికార పార్టీ కాస్త రిలాక్స్ మోడ్ లోకి వెళుతున్న సమయంలో దానం నాగేందర్ ఎపిసోడ్ జరగడం చర్చనీయాంశంగా మారింది. దానం ఎందుకు అలిగి పోయారంటే….

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కొమరం భీమ్ ఆదివాసీ భవన్ లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం లక్కీ డ్రా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యేగా దానం నాగేందర్ ముఖ్య అతిధిగా హాజరుకావాల్సింది. అయితే ఆయన రాకుండానే అధికారులు లక్కీ డ్రా నిర్వహించారు.  అధికారుల తొందరపాటు ఇప్పుడు సమస్యగా మారింది. ఎమ్మెల్యే వచ్చే వరకు ఆగకుండా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని దానం అనుచరులు మండి పడ్డారు. ఎమ్మెల్యే హాజరు కావట్లేదని మీకు ఎవరైనా సమాచారం ఇచ్చారా అని ప్రశ్నించిన కార్యకర్తలకు జవాబు చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు.

తనకు సరైన ప్రోటోకాల్ పాటించలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ లక్కీ డ్రా కార్యక్రమం నుంచి మధ్యలోనే వెళ్లి పోయారు. ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు. ఈ విషయం అటు అధికారుల మధ్య సమన్వయ లోపాన్ని బయట పెట్టిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రజా ప్రతినిధులను గౌరవించాలన్న కనీస మర్యాదను అధికారులు పాటించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కార్యక్రమం నుంచి వెళ్లి పోయిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇప్పుడేమి చేస్తారన్న దానిమీద అధికారులు, అధికార పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యేకు ప్రోటోకాల్  నిబంధనలు పాటించని అధికారులపై స్పీకర్ కు ఫిర్యాదు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం.

This post was last modified on August 29, 2026 5:32 pm

Share

Recent Posts

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

3 hours ago

విశ్వక్ సేన్ నిర్ణయం ఎటువైపు ఉంటుందో

ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…

5 hours ago

శ్రీవిష్ణు సినిమాకు అదొక్కటే సవాల్

ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…

5 hours ago

రాజుగారికి రాములోరి అభయం దక్కుతుందా

యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…

6 hours ago

అగ్గిపెట్టి మ‌చ్చా ఇక లేడు

అగ్గిపెట్టి మ‌చ్చా.. సోష‌ల్ మీడియా వాడే తెలుగు వాళ్ల‌కు ప్ర‌త్యేకంగా ఈ పేరును ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. అత‌డి…

7 hours ago

ఇకపై మొహమాటలు లేవంటున్న నాని

న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…

8 hours ago