రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళవుతుంది. వైసీపీ అధికారం కోల్పోయి కూడా రెండున్నరేళ్ళయ్యింది. అయినా ఇప్పటికీ వైసీపీ కోలుకోలేదు. ఓటమికి కారణాలు అన్వేషించకుండా రకరకాల ఆరోపణలతో కాలం వెళ్ళబుచ్చుతుంది. ఓటమి తర్వాత కూడా అధినేత జగన్ లో మార్పు రాలేదని ఆ పార్టీ శ్రేణులు లోలోన కుమిలి పోతున్నారు. అధినాయకుడు పట్టించుకోడు, స్థానిక నాయకులు బయటకు రావడం లేదు. దీంతో వైసీపీ కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
అదే మాట చెబుతున్నాడు వైసీపీ ఆస్థాన ‘ సర్వే’ యర్ ఆరా మస్తాన్. ఇటీవల విడుదలైన మూడ్ ఆఫ్ సర్వే నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగతంగా వైసీపీ బలహీనంగా వుందని చెప్పిన ఆయన మొత్తం 175 నియోజకవర్గాల్లోని 70 స్థానాల్లో సరైన ఇంచార్జిలు లేరని కేవలం 60 నియోజకవర్గాల్లో మాత్రమే సరైన అభ్యర్థులు వున్నారని కుండబద్దలు కొట్టారు. వారిలో చాలా మంది హైదరాబాద్ లో వ్యాపారాలు చేసుకుంటూ నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చి పోతున్నారని తెలిపారు.
పార్టీ నాయకత్వం నాయకులను, కార్యకర్తలను పట్టించుకోవడం లేదని కేడర్లో తీవ్ర అసంతృప్తి వుందని, కొంతమంది కార్యకర్తలు సొంత డబ్బులు ఖర్చు చేసి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరించారు. పార్టీ అధినేత జగన్ పార్లమెంట్ స్థాయి కార్యకర్తలతోనైనా సమావేశాలు పెట్టి మాట్లాడితే బాగుంటుందని కొందరు పార్టీ నాయకులు కోరుకుంటున్నారని చెప్పారు. ఈ సమాచారం అధినేతకు చేరవేసే దారులు వెదుకుతున్నారని చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది.
ఇప్పటికే పార్టీ అధినేత జగన్ కు వున్న ఇమేజ్, చరిష్మా మీదనే పార్టీ నడుస్తుందని చెప్పిన ఆరా మస్తాన్ నాయకత్వ స్థాయిలో లోపాలు సరిదిద్దుకోకపోతే క్షేత్ర స్థాయిలో నష్టం జరుగుతుందని వివరించారు. పార్టీకి బలమైన లీడర్షిప్, కేడర్ చాలా అవసరమన్నారు. జగన్ ఒంటరి పోరాటం మీదనే ఆధారపడితే నష్టం తప్పదని హెచ్చరించారు.
కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ అది వ్యతిరేకతగా మారలేదని విశ్లేషించారు. ఇంకా మూడేళ్ల సమయం వుందని, అప్పటి పరిస్థితిని ఇప్పుడే అంచనా వేయడం సరికాదన్నారు. సర్వేలు చూసి వైసీపీ కేడర్ సంబరాలు చేసుకుంటే తప్పులో కాలేసినట్టవుతుందని హెచ్చరించారు. కూటమికి నేతృత్వం వహిస్తున్న టీడీపీకి బలమైన కేడర్ వుందని, దాన్ని ఢీ కొట్టడం అంత ఈజీ కాదన్నారు. ఆరా మస్తాన్ చేసినట్లు చెబుతున్న ఈ వ్యాఖ్యలు ఏపీలో సంచలనం సృష్టిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఆయన వైసీపీ గెలుస్తుందని సర్వే వెల్లడించిన సంగతి తెలిసిందే.
This post was last modified on August 29, 2026 2:43 pm
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…
ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…
ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…
నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా గురించి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం…
నిన్న కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' టైటిల్ రివీల్ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అరిటాకులో భోజనాలు వడ్డించే ఒక…