అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జే ట్రంప్ అభిశంసనకు సొంతపార్టీ రిపబ్లికన్లు కూడా మద్దతు పలకటం సంచలనంగా మారింది. గురువారం తెల్లవారు జామున అమెరికా ప్రతినిధుల సభలో డెమక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం ఆమోదంపొందింది. అభిశంసన తీర్మానానికి అనుకూలంగా డెమక్రాటిక్ అభ్యర్ధులు 222 మంది మద్దతు తెలిపారు. అయితే పదిమంది రిపబ్లికన్ ఎంపిలు కూడా మద్దతుగా ఓటేయటం ట్రంప్ కు షాక్ కొట్టేదనటంలో సందేహం లేదు.
ఈనెల 20వ తేదీన అధ్యక్షునిగా జో బైడెన్ పదవీ బాధ్యతలు తీసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. మొన్నటి నవంబర్ 3వ తేదీన జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పై బైడెన్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే ట్రంప్ ఓడిపోయారో అప్పటి నుండి అమెరికాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ప్రపంచదేశాల ముందు అమెరికాను తలెత్తుకోనీకుండా ట్రంప్ చేస్తున్నారు. దీనికి పరాకాష్టంగా వారం రోజుల క్రితం అమెరికా పార్లమెంటు భవనం క్యాపిటల్ హిల్ పై ట్రంప్ మద్దతుదారులు జరిపిన దాడి నిలిచింది.
ట్రంప్ మద్దతుదారులు యధేచ్చగా ఆయుధాలు, బాంబులతో క్యాపిటల్ భవనంపై దాడులు జరిపారు. పార్లమెంటు భవనంలోకి దూసుకుపోయి బాంబులు పేల్చటంతో ప్రతినిధులంతా బిక్కచచ్చిపోయారు. మొత్తానికి అప్పటికప్పుడు అదనపు బలగాలను రప్పించి ఆందోళనకారులను చెదరగొట్టాల్సొచ్చింది. దాదాపు ఐదుగంటల పాటు ఆందోళనకారులు జరిపిన బీబత్సానికి ట్రంపే ప్రధాన కారణమని తేల్చారు. దాంతో ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని అప్పుడే డిసైడ్ అయ్యింది.
ఇందులో భాగంగానే గురువారం తెల్లవారుజామున పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రతినిధుల సభలో ట్రంప్ పై అభిశంసన తీర్మానం నెగ్గింది. దీని తర్వాత తీర్మానం సెనేట్ కు వెళుతుంది. అక్కడ కూడా నెగ్గితే ట్రంప్ ను అభిశంసించినట్లే. కాకపోతే అంత కాల వ్యవధిలేదు. అందుకనే ఇప్పటికప్పుడు ట్రంప్ అద్యక్షస్ధానం నుండి దిగిపోవాలంటూ ప్రతినిధులు డిమాండ్ చేశారు. అయితే 20వ తేదీకి ముందుగా ట్రంప్ అధ్యక్షపదవిని వదిలేట్లు కనబడటం లేదు. ఏదేమైనా అధ్యక్షపదవీ కాలంలో రెండుసార్లు అభిశంసనకు గురైన చెత్త రికార్డు మాత్రం ట్రంప్ సొంతమైంది.
This post was last modified on January 14, 2021 12:06 pm
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…