నిరీక్షణ ఫలించింది. మరో రెండు రోజుల్లో మాహమ్మారికి చెక్ పెట్టే టీకాను వాడటం షురూ చేయనున్నారు. తొలిదశలో వైద్యులు.. వైద్య ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. వ్యాక్సిన్ మీద పలు సందేహాలు వస్తున్న వేళ..అలాంటి వాటికి చెక్ చెబుతూ.. తెలంగాణలో తొలి టీకా తానే వేయించుకుంటానని మంత్రి ఈటెల రాజేందర్ చెప్పటం తెలిసిందే.
పలు సందర్భాల్లో తొలి టీకాను తానే వేయించుకుంటానని ఆయన చెప్పారు. అయితే.. అందుకు భిన్నంగా తెలంగాణలో తొలి టీకాను గాంధీ ఆసుపత్రిలో గడిచిన పది నెలలుగా విశేష సేవలు అందిస్తున్న ఒక పారిశుద్ధ్య కార్మికుడికి వేయనున్నట్లు వెల్లడించారు. పదహారు ఉదయం ఆ సఫాయి కర్మచారికి వ్యాక్సిన్ వేయటం ద్వారా.. తెలంగాణలో తొలి టీకా వేసినట్లు అవుతుంది.
తొలిరోజున 139 కేంద్రాల్లో టీకాలు వేయాలని భావించారు. అందులో 99కేంద్రాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. మిగిలిన 40 కేంద్రాలు ప్రైవేటు ఆసుపత్రిలో అని నిర్ణయించారు. తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చారు. తొలిరోజున టీకాలు వేసే 139 కేంద్రాలు ప్రభుత్వ రంగానికి చెందినవే ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
తొలి వారం పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించి.. రెండో వారం నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడతామని చెబుతున్నారు. ఇక.. మొదట్లో చెప్పినట్లుగా మొదటి రోజు వంద టీకాలు ఇవ్వకుండా.. తక్కువ మందికే ఇవ్వనున్నారు. ఒక క్రమపద్దతిలోనే టీకాల్ని పెంచుకుంటూ వెళదామని భావిస్తున్నారు.
టీకా వేసిన వారికి ధ్రువపత్రం ఇవ్వటంతోపాటు.. వారి మొబైల్ నెంబరును రిజిస్టర్ చేస్తారు. టీకా వేసుకున్న తర్వాత ఫోన్ కే ధ్రువపత్రాన్ని అందించేలా ఏర్పాట్లు చేశారు. ఇక.. టీకా కోసం అతి సురక్షితమైన ఏడీ సిరంజీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒకరికి టీకా వేసిన తర్వాత.. రెండో వారికి ఈ సిరంజిలు అస్సలు పని చేయవు. ఇది అత్యంత సురక్షితమైన టీకాగా చెబుతున్నారు.
This post was last modified on January 14, 2021 10:27 am
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…