తమిళ సినిమాలో అగ్ర నటుడిగా వెలుగొందిన నటుడు విజయ్ అనూహ్యంగా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. స్వర్గ సుఖాల జీవితం నుంచి ముళ్ల కిరీటం ధరించారు. రాజకీయంగా పెద్దగా అనుభవం లేకపోయినప్పటికి అనతికాలంలోనే ఢక్కా మొక్కీలు తింటున్నారు. రోజురోజుకు మరింత బలోపేతం అవుతున్నారు. పగలు రాత్రి తేడాలేకుండా ప్రజల మధ్య గడిపేస్తున్నారు. ఏదో సాధించాలన్న తపన కలిగినందునే చాలా మంది నటులకు కలగా మిగిలిన ముఖ్యమంత్రి పదవిని తొలి ప్రయత్నం లోనే అదిష్టించారు.
ఇప్పుడు విజయ్ ప్రాధామ్యాలు మారాయి. తమిళనాడు అధికార రాజకీయాల్లో తన స్థానం పదిలం చేసుకునేందుకు ఆయన కసిగా కృషి చేస్తున్నారు. అందుకే ఉదయం నాలుగు గంటల నుంచి దినచర్యను ప్రారంభిస్తున్నారు. 20 గంటల పాటు ప్రజల కోసం కేటాయించిన విజయ్ కేవలం 4 గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఏదో గెలిచాం కదాని నిర్లక్ష్యం చేయడం లేదు. ఎన్నికల్లో చేసిన హామీలు చాలా వున్నాయి. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. ఈ రెంటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు.
ఇదంతా ఆయన సొంతంగా చెప్పుకోలేదు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఇండియా టుడే నిర్వహించిన కాంక్లేవ్ లో ఆ రాష్ట్ర మంత్రి అధవ్ అర్జున చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయ్ సంబరాలకు దూరంగా వుంటున్నారని, ప్రతిరోజూ మంత్రులతో ఆయా శాఖలకు సంబందించిన సమస్యల గురించి చర్చించడం, షెడ్యూల్ ప్రకారం ఆరోజు చేయాల్సిన పనులను సమీక్షించడం వంటివి క్రమం తప్పకుండా చేస్తున్నారని తెలిపారు.
ఒక కొత్త తరానికి చెందిన ముఖ్యమంత్రిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. మంత్రి మాటలు ఇప్పుడు తమిళనాడు పత్రికల్లో పతాక శీర్షికల్లో ప్రచురించాయి. ప్రజా జీవితంలో రాణించాలంటే వ్యక్తిగత జీవితాన్ని త్యజించడం తప్పదని రాజకీయ విశ్లేషకు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates