డీఎస్సీ నియామకాల విషయంలో అక్రమాలు జరిగాయని రచ్చ చేస్తున్న వైసీపీ అధినేత జగన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టి సవాల్ విసిరారు. అసెంబ్లీ లో ఆయన మాట్లాడుతూ…లేనిపోని ఆరోపణలు చేసి ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బ తీయకుండా, కష్టపడి ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుల సామార్ధ్యాన్ని కించ పరచకుండా అసెంబ్లీ వచ్చి చర్చించాలని సవాల్ చేశారు. నీ ప్రశ్నలన్నిటికీ సాక్షాలతో సమాధానం చెబుతామన్నారు.
1995 నుంచి 2025 వరకు 30 ఏళ్ళల్లో 14 డీఎస్సీల్లో 11 నేనే నిర్వహించాను. 80 శాతం పాఠశాలల్లో నేను నిర్వహించిన డీఎస్సీ ఉపాధ్యాయులే ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్కరు కూడా డీఎస్సిల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రాలేదు. ఏ ఒక్కరూ అలాంటి ఆరోపణ చేయలేదు. ఇప్పుడు జగన్ డీఎస్సీ నియమాకాల్లో అక్రమాలు జరిగాయంటూ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. లేనిపోని గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.
డీఎస్సీ నియామకాల విషయంలో అంతా పారదర్శకంగా వ్యవహారించాం. ఏదీ దాచి పెట్టలేదు. ఆన్సర్ కీ, మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్టు అభ్యర్థులకు అందుబాటులో ఉంచాం. ఎక్కడా దాపరికం లేదు. అసెంబ్లీ పవిత్రమైన దేవాలయం లాంటిది. ఇక్కడికి వచ్చి అడిగితే సమాధానం ఇస్తాం. నువ్వు కాకపొతే నీ ఎమ్మెల్యే లు వచ్చినా సమాధానం చెబుతాం. రోడ్ల మీదకు ఎక్కి మాట్లాడ్డం దేనికంటూ ప్రశ్నించారు.
ఆ తర్వాత అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడారు. జగన్ హయాంలో జరిగిన గ్రూప్ -1 స్కాం గతంలో ఎప్పుడు జరగలేదన్నారు. నా 50 చరిత్రలో ఇలాంటి స్కాం చూళ్ళేదన్నారు. రెండు రోజుల్లో గ్రూప్ -1 అక్రమాలలో వాస్తవాలను బయట పెడతామన్నారు. దీంతో వైసీపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా తయారైందన్న మాట వినిపిస్తుంది. డీఎస్సీ అక్రమాల పేరుతో చంద్రబాబును ఊరికే కెళ్ళుక్కున్నామని కొందరు వైసీపీ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు.
This post was last modified on August 18, 2026 9:09 am
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…