Movie News

కూలిన సూర్య కోట నిలబడింది

తెలుగులో ఒకప్పుడు ఇక్కడి స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్న తమిళ కథానాయకుడు సూర్య. చాలా ఏళ్ల పాటు సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్‌లకే ఇక్కడ ఆదరణ ఉండేది. మిగతా తమిళ స్టార్లకు స్థిరమైన మార్కెట్ ఉండేది కాదు. అలాంటి టైంలో ‘గజిని’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు చూరగొన్న సూర్య.. ఆ తర్వాత మరి కొన్ని మంచి సినిమాలతో నిలకడగా ఇక్కడ హిట్లు కొట్టి పెద్ద రేంజికి ఎదిగాడు.

2010 టైంలోనే అతడికి రూ.15 కోట్ల దాకా మార్కెట్ ఉండేది. ‘24’ సినిమా తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ వసూళ్లు రాబట్టి హిట్ స్టేటస్ అందుకోవడం విశేషం. కానీ తర్వాత సరైన సినిమాలు చేయక సూర్య తెలుగులో ఫాలోయింగ్, మార్కెట్ దెబ్బ తీసుకున్నాడు. గత ఏడాది వచ్చిన ‘రెట్రో’ సినిమాకైతే కనీస స్థాయిలో కూడా ఓపెనింగ్స్ రాలేదు. సూర్యను మన జనాలు పూర్తిగా పక్కన పెట్టేసిన పరిస్థితి కనిపించింది.ఇక మళ్లీ సూర్య పుంజుకోవడం కష్టమే అనుకున్నారు.

కానీ ఈ ఏడాది కథ మారింది. ‘కరుప్పు’తో పైకి లేచి నిలబడ్డ సూర్య.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో ఎక్కడికో వెళ్లిపోయాడు. ‘కరుప్పు’ తమిళంలో ఆడినంత బాగా తెలుగులో ఆడలేదు. ఆ రొటీన్ మాస్ మూవీ మన వాళ్లకు ఓ మోస్తరుగా అనిపించిందంతే. ఇక్కడ దానికి భారీ వసూళ్లేమీ రాలేదు. కానీ సూర్య లేటెస్ట్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మాత్రం తెలుగులో దుమ్ము దులుపేస్తోంది.

ఇది నిజానికి తమిళ చిత్రమే. తెలుగులోకి అనువదించారు. కానీ వెంకీ అట్లూరి డైరెక్ట్ చేయడం, కథాంశం మనకు కనెక్టయ్యేలా ఉండడంతో దీన్ని మన వాళ్లు ముందు నుంచి బాగా ఓన్ చేసుకున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరిగాయి. పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్లో వసూళ్ల మోత మోగింది.

తెలుగులో మాత్రమే ఈ చిత్రం తొలి వారాంతంలోనే రూ.50 కోట్ల మార్కును దాటేయడం విశేషం. యుఎస్‌లో ఆల్రెడీ 1 మిలియన్ మార్కు దాటేసింది. దాదాపుగా అన్ని ఏరియాల్లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బ్రేక్ ఈవెన్ మార్కుకు చేరువైంది. తమిళ వెర్షన్‌కు దీటుగా, ఇంకా చెప్పాలంటే దాన్ని మించి తెలుగులో సూర్య సినిమా వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాతో దెబ్బ తిన్న తన మార్కెట్ మొత్తాన్ని తిరిగి తెచ్చుకున్నాడు సూర్య. ఈ ఊపులో ఇంకో హిట్ పడితే.. తెలుగులో తన రేంజే మారిపోవడం ఖాయం.

This post was last modified on August 17, 2026 8:25 pm

Share

Recent Posts

తెలంగాణపై బీజేపీ ఆశలు వదులుకుందా?

ఉత్తరాదిలో బలంగా పాతుకుపోయిన బీజేపీ దక్షిణాదిలో పాగా వేయాలని చాలాకాలంగా విశ్వప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ ప్రయత్నాలు కర్ణాటకలో కొంతవరకు సఫలమైనప్పటికీ…

2 hours ago

పాట రాకుండానే ‘ప్యారడైజ్’ ట్రెండింగ్

షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో టీమ్ చాలా ఒత్తిడిలో ఉంది కానీ ప్యారడైజ్ మీద క్షేత్ర స్థాయిలో ఎంత బజ్…

3 hours ago

అనిరుధ్, కావ్య మార‌న్ పెళ్లి డేట్ వ‌చ్చేసిందా?

గ‌త కొన్ని నెల‌లుగా త‌మిళ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ ర‌విచంద‌ర్ పెళ్లి గురించి జోరుగా ఊహాగానాలు న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే.…

3 hours ago

ఉరిశిక్షలు విధించడంలో ఈ జడ్జి ఆల్ టైం రికార్డ్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన అభిలాష చిత్రం ‘ఉరిశిక్ష’పై ఎంత పెద్ద డిబేట్ కు తెరలేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.…

3 hours ago

మంత్రి తప్పుకి అసెంబ్లీలో సారీ చెప్పిన సీఎం

చట్టసభలను గతంలో చాలామంది నేతలు దేవాలయాలుగా భావించేవారు. ప్రజల జీవితాలను మార్చగలిగే చట్టాలను చేసేందుకు తమకు అధికారం ఇచ్చారని జవాబుదారీతనంగా…

5 hours ago

బ్రేకప్ వివాదంపై స్పందించిన ధృవ్ విక్రమ్?

గ‌త కొన్ని రోజులుగా మ‌ల‌యాళ సినీ న‌టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తోంది. త‌న పాస్ట్ ల‌వ్ స్టోరీ…

6 hours ago