తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి… పాలిటిక్స్ తో పాటు ఇతరత్రా అంశాలపైనా ఓ రేంజి అవగాహన కలిగిన నేతగా గుర్తించక తప్పదు. ఎందుకంటే… నిత్యం రాజకీయాల్లో మునిగితేలే రేవంత్ రెడ్డి…మానవ సంబంధాలు.. అందులోనూ తల్లిదండ్రులు, వారి పిల్లల మధ్య కొనసాగుతున్న సంబంధాలు… పిల్లలు పెద్దయ్యాక వారు వ్యవహరిస్తున్న తీరు… ఆ తీరుతెన్నులు మంచివా? చెడ్డవా? అని వివరించి చెప్పడంతో పాటుగా ఏ తరహా పద్ధతి అయితే మంచిదన్న విషయాన్నీ ఆయన అందరికీ అర్థమయ్యేలా… తనదైన భాషలో చెప్పారు. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పే గురుతర బాధ్యత కలిగిన ఉపాధ్యాయులతోనే ఆయన హప్పట్లు కొట్టించుకున్నారు.
తెలంగాణ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపుగా అన్నిశాఖలను తన సహచర మంత్రులకు అప్పగించిన రేవంత్ రెడ్డి… విద్యా శాఖను మాత్రం తన వద్దే అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేయడంతో పాటుగా.. విద్యలో తెలంగాణను ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఆదర్శంగా నిలిపే దిశగా ఆయన కీలక అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే విద్యా శాఖకు సంబందించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న రేవంత్… విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే దిశగా సాగుతున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో విద్యా వ్యవస్థలో చేపట్టాల్సిన మలిదశ సంస్కరణలపై అధ్యయనం కోసం ఇటీవలే విదేశాలకు వెళ్లి వచ్చిన ఉపాధ్యాయులతో గురువారం ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్ డీ లో జరిగిన ఈ సమావేశంలో కీలక ప్రసంగం చేసిన రేవంత్… అందులో మానవ సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలా చూసుకుంటారో… పిల్లలు కూడా వారి తల్లిదండ్రులను అదే మారిదిగా చూసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పిల్లలను తల్లిదండ్రులు హాస్టల్ లో వేస్తే.. పిల్లలు పెద్దయ్యాక వారి తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్ లలో వేస్తుెన్నారని ఆయన అన్నారు.
విద్యార్థి దశలో పిల్లలను హాస్టల్ లలో ఉంచడం కంటే కూడా ఇంటి వద్ద నుంచే బడికి పంపడం మంచిదని కూడా రేవంత్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. నేరుగా ఆ మాట అనకున్నా… పిల్లలు ఇంటి వద్ద నుంచే బడికి వెళితే… తల్లిదండ్రులతో వారికి అన్యోన్యత పెరుగుతందని, భబిష్యత్తుల్లో మానవ సంబంధాలు బలంగా ఉంటాయని ఆయన అన్నారు. ఈ విషయాన్ని గ్రహించిన కారణంగానే ప్రభుత్వ బడుల్లో ఉదయం, మధ్యాహ్నం విద్యర్థులకు భోజనం పెట్టి సాయంత్రానికంతా వారిని ఇంటికి పంపే ఏర్పాట్లు చేశామని ఆయన అన్నారు. పిల్లలు ఇంటిలో ఉంటే… తల్లిదండ్రుల మధ్య కీచులాటలు కూడా తక్కువవుతాయని ఆయన ఉదాహరణలతో సహా చెప్పారు. మానవ సంబంధాలు బలంగా ఉంటే… ఏ రాష్ట్రమైనా, ఏ దైశమైనా అభివృద్ధి పథంలో దూసుకువెళతాయని తెలిపారు. మానవ సంబంధాలు బలహీనంగా ఉన్న దేశాలు పురోభివృద్ధి సాధించిన దాఖలా లేదని కూడా ఆయన గుర్తు చేశారు.
ఇక ఉపాధ్యాయులకు కూడా రేవంత్ కీలకమైన సూచనలు చేశారు. విద్యా శాఖలో ఏ కొత్త నిర్ణయం తీసుకోవాలనుకున్నా.. ఉపాధ్యాయ సంఘాల నుంచి విమర్శలు వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను తాను తీరుస్తానని, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా ఉపాధ్యాయులు మెలగాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తొలి పదేళ్లలో ఏనాడూ తొలి తారీఖున జీతాలు పడలేదని చెప్పిన రేవంత్… తాను సీఎంగా వచ్చిన తర్వాత ప్రతి నెల ఫస్ట్ ననే వేతనాలు వేస్తున్నామని ఆయన తెలిపారు. విద్యా శాఖను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తామని ఆయన పేర్కొన్నారు. 2034దాకా తానే సీఎంగా ఉంటానంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
