Political News

ఏపీలో మాజీ మంత్రి ఓటు గల్లంతు… ఇప్పుడెలా ‘సర్’?

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు కావడం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి డాక్టర్ శనక్కాయల అరుణకుమారి పేరు గుంటూరు నగర ఓటరు జాబితాలో కనిపించకపోవడంతో ఆమె అధికారులను ఆశ్రయించారు. ఒక మాజీ మంత్రి ఓటే లేకపోతే సామాన్య ఓటర్ల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఓటరు జాబితాలో తన పేరు లేదని ఎన్నికల అధికారులు చెప్పడంతో అరుణకుమారి ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం గుంటూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన ఓటును పునరుద్ధరించాలని కోరారు.

డాక్టర్ శనక్కాయల అరుణకుమారి 1999 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రెండో మంత్రివర్గంలో ఆమెకు మంత్రి పదవి దక్కింది.

ఇదిలా ఉండగా, కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ముగింపు దశకు చేరుకుంది. ఇంటింటి సర్వే, డిజిటలైజేషన్ ప్రక్రియకు జూలై 14 చివరి గడువుగా నిర్ణయించారు. మరణించినవారు, వేరే ప్రాంతాలకు వెళ్లినవారు, డూప్లికేట్ ఓట్లను తొలగించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ఈ ప్రక్రియ లక్ష్యం.

చివరి రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అధికారులు సవరణ పనుల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు ప్రజలు హెల్ప్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి సమయంలో మాజీ మంత్రి ఓటు గల్లంతు కావడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

This post was last modified on July 13, 2026 1:11 pm

Share

Recent Posts

పెళ్లి గురించి హనుమాన్ హీరో క్లారిటీ

టాలీవుడ్లో యువ కథానాయకులు ఒక్కొక్కరుగా పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో అల్లు శిరీష్ వివాహం చేసుకున్న…

6 hours ago

లెక్క తప్పిన చుక్క చిత్రాలు… ఇమేజ్ మీద మరకలు

భారీ ప్యాన్ ఇండియా మూవీ, ఇమేజ్ ఉన్న స్టార్ హీరో అని కథ పూర్తిగా వినకుండా, జల్లెడ పట్టకుండా తొందరపడితే…

7 hours ago

సెక్యూరిటీ లేకుండా వెళ్లి చంద్రబాబుతో పవన్ ఏం చెప్పారు?

సుప్రీం కోర్టు తీర్పుతో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.…

7 hours ago

అర్జునుడి కష్టాలు పేరుకి తగ్గట్టే ఉన్నాయి

తమ స్వంత ప్రమేయం లేకుండా ఎవరి వల్లనో ఇబ్బందులు, కష్టాలు పడాల్సి వస్తే ఆ బాధ మాములుగా ఉండదు. ఇట్లు…

8 hours ago

ప్రశాంత్ నీల్ బ్రాండ్ మహత్యం ఇది

కెజిఎఫ్, సలార్ రూపంలో తనకంటూ కల్ట్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. తను డైరెక్ట్ చేయకపోయినా కేవలం కథను…

9 hours ago

సంజూ మొదలెట్టాడు… నమన్ ధీర్ ముగించాడు!

225 పరుగులు చేసినా న్యూజిలాండ్‌కు విజయం దక్కలేదు. టీమ్ఇండియా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను ఛేదించింది. అయితే…

9 hours ago