మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు. కానీ తన అద్భుత నటనతో చాలా తక్కువ టైంలో ఊహించిన స్థాయికి వెళ్లిపోయాడు ఫాహద్. ‘కుంబలంగి నైట్స్’, ‘జోజి’ సహా అనేక చిత్రాలు తనలోని స్పెషల్ టాలెంటుని బయటపెట్టాయి.
కొంచెం సైకో లక్షణాలున్న పాత్రలు పడితే అతను ఎలా చెలరేగిపోతాడో చాలా చిత్రాల్లో చూశాం. తెలుగులో నటించిన ‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాల్లో కూడా అతడిది ఆ తరహా పాత్రే. ప్రతిసారీ ఇలాంటి క్యారెక్టర్లకు న్యాయం చేస్తూ మొనాటనీ రాకుండా చేస్తున్నా సరే.. ఫాహద్ అనగానే ఇలాంటి పాత్రలకే కరెక్ట్ అనే ముద్ర పడిపోతోంది. ఇలాంటి టైంలో ఫాహద్ తన ఇమేజ్‌కు భిన్నమైన పాత్రను చేస్తున్నాడు ఓ తెలుగు చిత్రంలో. అదే.. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్.
రాజమౌళి సమర్పణలో ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ, జక్కన్న తనయుడు కార్తికేయ కలిసి నిర్మిస్తున్న చిత్రమిది. శశాంక్ యేలేటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా టీజర్ తాజాగా లాంచ్ అయింది. ఇందులో ఫాహద్‌ది పూర్తిగా నవ్వించే పాత్రలా ఉంది. అతను ఇందులో మెజీషియన్ పాత్ర చేస్తున్నాడు. అతడి విన్యాసాలు చూసి ఇంప్రెస్ అయి ఒక చిన్న పాప అతడికి దగ్గరవుతుంది. తర్వాత ఆ పాపే మంత్ర తంత్రాలు తెలిసిన అమ్మాయని అతడికి అర్థమవుతుంది.
తనకు భయపడి పారిపోతుంటే.. అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరికింది, వాడేసుకో అని ఇంకో వ్యక్తి సలహా ఇస్తాడు. మరి ఆ పాపతో కలిసి ఈ ఛోటా మెజీషియన్ ఏం చేశాడన్నది మిగతా కథ. టీజర్ పూర్తి వినోదాత్మకంగా సాగి.. ఒక క్రేజీ రైడ్ చూడబోతున్న సంకేతాలు ఇచ్చింది. సెప్టెంబరు 11న ఈ చిత్రం విడుదల కానున్నట్లు టీజర్లో ప్రకటించారు. కానీ ఆ రోజు విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సినిమా రావాల్సి ఉంది. నిజంగా విజయ్ మూవీ రిలీజైతే ఆ పోటీని ఈ చిన్న చిత్రం తట్టుకోగలదా అన్నది సందేహం.
This post was last modified on July 13, 2026 1:31 pm
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…