ఒకవైపు ఎముకలు కొరికేసేంత చలి. మరోవైపు కుండపోత వర్షం. దాంతో టెంట్లలోకి చేరిపోయిన వర్షంనీళ్ళు. అయినా సరే తమ దీక్షలను వదిలిపెట్టేది లేదంటూ భీష్మించుకుని రోడ్లపైనే కూర్చున్నారు. ఇది…తాజాగా సింఘూ ప్రాంతంలో వేలాదిమంది రైతుల పరిస్ధితి. ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లోని సింఘూ ప్రాంతంలో వేలాదిమంది రైతులు మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గడచిన 40 రోజులుగా ఉద్యమం చేస్తున్న రైతులను చలి, వర్షాలు కూడా ఏమీ చేయలేకపోయాయి.
ఇప్పటికి ఏడుసార్లు రైతుసంఘాలతో కేంద్రప్రభుత్వం జరిపిన చర్చలు ఫెయిలయ్యాయి. నిజానికి చట్టాలను రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఇదే సమయంలో వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తేకానీ తమ ఉద్యమాన్ని విరమించేది లేదంటూ రైతుసంఘాలు తెగేసి చెప్పాయి. అంటే ఇటు కేంద్రమైనా అటు రైతుసంఘాలైనా తమ డిమాండ్లకే పట్టుబట్టున్నాయి. అందుకనే చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎంత వ్యతిరేకతున్నా చట్టాలను అమలు చేయాల్సిందే అని ప్రధానమంత్రి నరేంద్రమోడి చాలా పట్టుదలగా ఉన్నారు.
ఇదే సమయంలో అవసరమైతే ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసి కేంద్రం మెడలు వంచాలని రైతుసంఘాలు కూడా మహా పట్టుదలగా ఉన్నాయి. పంజాబులో మొదలై ఉద్యమం తర్వాత హర్యానాకు పాకింది. ఆ తర్వాత మహారాష్ట్ర, రాజస్ధాన్, పశ్చిమబెంగాల్ కూడా పాకింది. దేశంలోని అన్నీ రైతుసంఘాలను సంఘటితం చేయాలనేది ఉద్యమం చేస్తున్న రైతుసంఘాల ప్లాన్ గా కనబడుతోంది.
ఇప్పటికే ఉద్యమం చేస్తున్న రైతుల్లో దాదాపు 10 మంది చనిపోయారు. చలిని తట్టుకోలేకే కొందరు రైతులు మరణించారు. భోజనాలు, స్నానాలు, చర్చలు, వైద్య పరీక్షలు, నిద్ర, ఉదయంపూట వ్యాయామాలు అన్నీ దీక్షా ప్రాంతంలోనే జరిగిపోతున్నాయి. ఇన్ని రోజులైనా ఉద్యమం నుండి రైతులు ఎందుకు వెనక్కుపోవటం లేదు ? ఎందుకంటే పై రాష్ట్రాల నుండి రోజు వేలాదిమంది రైతులు వచ్చి మద్దతు తెలుపుతున్నారు. అలాగే వైద్యులతో పాటు కొన్ని స్వచ్చంద సంస్ధలు దీక్షా స్ధలానికి వచ్చి తమ సేవలను అందిస్తున్నాయి కాబట్టే.
రైతుసంఘాలతో స్వయంగా ప్రధానమంత్రి చర్చలకు కూర్చుంటే కానీ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం లేదు. వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది మోడే మాత్రమే అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ వ్యవసాయ చట్టాల రద్దును మోడి ఎందుకనో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏ రైతాంగం కోసమే తాము చట్టాలను చేశామని మోడి చెబుతున్నారో అదే రైంతాగం ఆ చట్టాలను వద్దంటున్నాయి. అలాంటపుడు చట్టాలను రద్దు చేయటానికి మోడికి వచ్చిన సమస్యేమిటి ?
This post was last modified on January 7, 2021 11:49 am
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…