Political News

ట్రంప్ కు సుప్రీంకోర్టు షాక్… పౌరసత్వంపై కీలక తీర్పు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన బర్త్ రైట్ సిటిజన్ షిప్ పరిమితుల ప్రయత్నానికి అమెరికా సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. అమెరికాలో పుట్టిన పిల్లలకు రాజ్యాంగం కల్పించిన పౌరసత్వ హక్కును కొనసాగిస్తూ కీలక తీర్పు వెలువరించింది.

అక్రమ వలసదారులు లేదా తాత్కాలిక వీసాలపై ఉన్న వారి పిల్లలకు ఆటోమేటిక్ గా పౌరసత్వం ఇవ్వకూడదని ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్తర్వుపై పలు కోర్టుల్లో సవాళ్లు దాఖలయ్యాయి. చివరకు ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు చేరింది.

విచారణ అనంతరం అమెరికా రాజ్యాంగంలోని పద్నాలుగో సవరణ ప్రకారం అమెరికాలో జన్మించిన వారికి పౌరసత్వ హక్కు వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పాత న్యాయ తీర్పులను కూడా కోర్టు ప్రస్తావించింది.

ఈ తీర్పు ట్రంప్ వలస విధానాలకు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే రాజ్యాంగ పరిమితులను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి అమెరికాలో జన్మించిన వారికి బర్త్ రైట్ సిటిజన్ షిప్ కొనసాగుతుందనే అంశంపై సుప్రీంకోర్టు మరోసారి స్పష్టత ఇచ్చింది. దీంతో ఈ అంశంపై నెలకొన్న అనిశ్చితికి తెరపడినట్టైంది.

This post was last modified on June 30, 2026 9:24 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

2 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

4 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

4 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

5 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

5 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

6 hours ago