Political News

‘అప్పుడు కేజీఎఫ్‌… ఇప్పుడు జొన్న‌గిరి’

ఒక‌ప్పుడు బంగారం నిల్వ‌ల విష‌యంలో కేజీఎఫ్ గురించి చ‌ర్చ జ‌రిగేద‌ని.. కానీ, ఇప్పుడు క‌ర్నూలు జిల్లాలోని జొన్న‌గిరి గురించి దేశ‌వ్యాప్తంగా చ‌ర్చించుకుంటున్నార‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో ఉన్న‌ జొన్నగిరిలో బంగారం శుద్ధి కర్మాగారాన్ని బుధ‌వారం ఆయ‌న‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జొన్న‌గిరి ప్రాంతానికి శ‌తాబ్దాల నాటి చ‌రిత్ర ఉంద‌ని తెలిపారు. ఘ‌న‌మైన వార‌స‌త్వ సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను చ‌రిత్ర‌ను ప‌రిర‌క్షిస్తున్నామ‌న్నారు.

అశోక చ‌క్ర‌వ‌ర్తి కాలంలో ఈ ప్రాంతం నాలుగో రాజ‌ధానిగా ఉండేద‌ని.. అప్ప‌ట్లో సువ‌ర్ణ‌గిరిగా ఈ ప్రాంతాన్ని పిలిచిన విష‌యాన్ని సీఎం చంద్ర‌బాబు గుర్తు చేశారు. ఇదే త‌ర‌హాలో రాయ‌ల‌సీయ‌ను అభివృద్ధి చేసేందుకు తాము ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌న్నారు. సీమ‌కు కీల‌క‌మైన ప్రాజెక్టుల‌ను త‌మ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తోంద‌ని తెలిపారు. సాగునీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నామన్నారు. త‌ద్వారా వ‌ల‌స‌లు నివారించి.. ఇక్క‌డివారికి ఉపాధి క‌ల్పించేందుకు కృషి చేస్తున్న‌ట్టు చెప్పారు.

జొన్న‌గిరిలో ఏడాదికి ట‌న్ను బంగారం ల‌భిస్తుంద‌ని చంద్ర‌బాబు చెప్పారు. అయితే.. ప్ర‌స్తుతం 400 కిలోల వెలికితీతకు ప్రారంభోత్స‌వం చేశామ‌ని.. భ‌విష్య‌త్తులో వెయ్యి కిలోల బంగారం వెలికితీత శుద్ధికి ప్రాధాన్యం పెరుగుతుంద‌ని చెప్పారు. జొన్న‌గిరిలో ఇప్పటికే 800 ఉద్యోగాలు వచ్చాయన్న చంద్ర‌బాబు.. త్వరలో 1500 మందికి ఉపాధి కల్పిస్తామ‌ని చెప్పారు. జొన్న‌గిరి చిరునామా ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా మారుతోందని తెలిపారు.

న‌గ‌ల త‌యారీ కూడా..

జొన్న‌గిరిలో న‌గల త‌యారీ కేంద్రం ఏర్పాటుకు కూడా కృషి చేస్తామ‌న్నారు. పెట్టుబ‌డులు పెట్టేవారికి.. రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని విధాలా స‌హ‌కారం అందిస్తుంద‌ని చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా.. అన్ని వ‌న‌రుల‌ను స‌మ‌కూరుస్తున్నామ‌న్నారు. పెట్టుబ‌డుల‌కు ఏపీ చిరునామాగా మారింద‌న్నారు. క‌ర్నూలుకు త్వ‌ర‌లోనే ఏపీ హైకోర్టు బెంచ్ రానుంద‌ని వివ‌రించారు. అలాగే.. రాయ‌ల‌సీమ స్టీల్ ప్లాంటు(క‌డ‌ప‌)ను కూడా 2028నాటికి పూర్తి చేస్తామ‌న్నారు.

This post was last modified on June 24, 2026 10:01 pm

Share

Recent Posts

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

1 hour ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

1 hour ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

3 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

5 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

5 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

6 hours ago