Political News

పేరు చెబితే ల‌క్ష… స‌ర్కారు బంప‌ర్ ఆఫ‌ర్‌!

ప్ర‌భుత్వాలు చేప‌ట్టే కీల‌క కార్య‌క్ర‌మాల‌కు పేర్లు సూచించే వారికి బ‌హుమానాలు ఇస్తుంటాయి. అలానే కానుక‌లు కూడా ఇస్తాయి. గ‌తంలో స్వ‌చ్ఛ భార‌త్ లోగో(గాంధీ క‌ళ్ల‌జోడు, చేతి క‌ర్ర‌తో ఉన్న‌ది) సూచించిన వారికి 10 ల‌క్ష‌ల రూపాయ‌ల బ‌హుమ‌తి ఇచ్చారు. ఆ త‌ర్వాత‌.. మ‌న భార‌త క‌రెన్సీకి కూడా అంత‌ర్జాతీయ స్థాయిలో ఒక ప్ర‌త్యేక గుర్తింపు తీసుకురావాల‌ని సంక‌ల్పించిన కేంద్రం.. దీనిని సూచించిన వారికి కూడా ప్ర‌త్యేక కానుక‌గా 2 ల‌క్ష‌ల రూపాయ‌ల ప్ర‌క‌టించింది. అప్ప‌ట్లో దీనిని మ‌హారాష్ట్ర‌కు చెందిన టెకీ ఒక‌రు సొంతం చేసుకున్నారు.

ఇలా.. రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా తాము చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌కు పేర్ల‌ను చెబితే.. అవి న‌చ్చి.. ఎంపికైతే కానుక‌లు, బ‌హుమానా లు ఇస్తున్నాయి. గ‌తంలో ఏపీ రాజ‌ధానికి పేరును సూచిస్తే 50 వేల కానుక ప్ర‌క‌టించారు. కానీ.. అమ‌రావ‌తి పేరును ఓ ప్ర‌ముక ప‌త్రిక అధినేత సూచించ‌డంతో ఆ పేరును ఖరారు చేశారు. ఆ త‌ర్వాత‌.. యోగాంధ్ర సింబ‌ల్ స‌హా విశాఖ-గూగుల్ డేటా కేంద్రాల పేర్ల‌తో ఒక చ‌క్క‌ని పేరును సూచించాల‌ని కూడా ప్ర‌భుత్వం కోరింది. దీనికి కూడా ల‌క్ష రూపాయ‌ల కానుక‌ను ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు vizaG- అనే పేరును సూచించి.. దానినే ఖ‌రారు చేశారు. ఇలా.. కీల‌క కార్య‌క్ర‌మాల‌కు పేర్లు సూచించ‌డం అనేది ఇంట్ర‌స్టింగ్‌గా మారింది.

ఇక‌, తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం కూడా కొత్తగా వినూత్న‌ పేరును సూచించిన వారికి ల‌క్ష రూపాయ‌ల బ‌హుమానం ప్ర‌క‌టించింది. ఫ్యూచ‌ర్ సిటీ ప‌రిధిలో ఔట‌ర్ రింగ్ రోడ్డు లోప‌లి ప్రాంతాన్ని క్యూర్‌ జోన్‌గా సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కారు అభివృద్ది చేస్తోంది. దీనిని రాష్ట్రంలోని ప్ర‌ఖ్యాత న‌గ‌రాల‌కు దీటుగా అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలో అన్ని వ‌ర్గాల వారికీ దీనిలో భాగ‌స్వామ్యం క‌ల్పించేందుకు పేద‌ల‌కు కూడా ఇళ్లు నిర్మిస్తున్నారు. దాదాపు ల‌క్ష ఇళ్లను నిర్మించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో దీనికి వినూత్న పేరును సూచించాల‌ని ప్ర‌భుత్వం కోరింది. ఈ నెల 28లోగా పేరును సూచించిన వారికి ల‌క్ష రూపాయ‌ల బ‌హుమ‌తి ఇవ్వ‌డంతోపాటు.. సూచించిన వారి పేరుతో ప్ర‌క‌ట‌న కూడా జారీ చేస్తామ‌ని తెలిపింది.

నిబంధ‌న‌లు ఇవీ..

  • ఒక్క‌రు ఎన్ని పేర్ల‌యినా సూచించ‌వ‌చ్చు.
  • పేరులో క్యూర్ జోన్ ప్ర‌తిబింబించాలి.
  • తెలంగాణ అస్తిత్వాన్ని ప్ర‌తిబింబించేలా ఉంటే మంచిది.
  • ల‌క్ష ఇళ్ల నిర్మాణం వెనుక ఉన్న ఉద్దేశాన్ని చాటేలా కూడా పేరు ఉండాలి.
  • ప్ర‌క్రియ మొత్తం tghd insta లో మాత్ర‌మే సాగుతుంది.

This post was last modified on June 24, 2026 8:19 am

Share

Recent Posts

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

1 hour ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

1 hour ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

3 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

5 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

5 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

6 hours ago