Movie News

గూండా ఎమోషన్ గుర్తు చేసిన మెగాస్టార్

నిన్న పెద్ది సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి నిలిచారు. గతంలో తండ్రి కొడుకుల స్టేజి కలయిక చాలాసార్లు చూసినప్పటికీ ఈ సినిమా స్పెషల్ మెమరీ కాబట్టి దానికి అనుగుణంగానే ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. మెగాస్టార్ ఏం మాట్లాడతారనే దాని మీద అభిమానుల్లో ఎగ్జైట్ మెంట్ ఉంది. ముఖ్యంగా చరణ్ ఈ మూవీ కోసం పడిన కష్టాన్ని చిరు వర్ణించిన తీరు, ఫ్లాష్ బ్యాక్ లో గూండాకు సంబందించిన ఒక జ్ఞాపకం ఎమోషనల్ గా సాగాయి.

1983 ప్రాంతంలో గూండా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతున్నప్పుడు చిరంజీవి డూప్ లేకుండా నిజమైన రైల్వే బ్రిడ్జ్ మీద స్టంట్స్ చేస్తున్నారు. ఏ మాత్రం అటు ఇటు అయినా ప్రాణానికే ప్రమాదం. ఆ సమయంలో అక్కడే ఉన్న తండ్రి వెంకట్ రావు ఇదంతా చూసి ఖంగారు పడిపోయారు. షాట్ అయ్యాక ఇలా రిస్క్ చేయడం ఎందుకని అడిగితే చిరు సమాధానమిస్తూ ఫ్యాన్స్ ని సంతృప్తి పరచడానికి ఇదంతా చేయాలి, అయినా ఏం కాదు టెన్షన్ పడకని హామీ ఇచ్చారు.

దీనికి కుదుటపడని వెంకట్ రావు బదులుగా ఒక కౌంటర్ వేశారు. చిరంజీవి సతీమణి అప్పుడు గర్భవతి కాబట్టి ఒకవేళ నీకు కొడుకు పుట్టి వాడు స్టార్ అయ్యి ఇలాంటి రిస్కులు చేసినప్పుడు తండ్రి పడే యాతన ఎలా ఉంటుందో నీకు తెలిసి వస్తుందని అన్నారు. నలభై ఏళ్ళ తర్వాత సరిగ్గా అదే జరిగింది. పెద్ది చిత్రీకరణలో చరణ్ కంటికి ప్రమాదం జరిగింది. ఇంకొంచెం కింద తగిలి ఉంటే కనుగుడ్డుకు సర్జరీ చేయాల్సి వచ్చేదని డాక్టర్ చెప్పారు. అదృష్టవశాత్తు అంత సీరియస్ గా మారలేదు.

ఇదంతా చిరంజీవి స్వయంగా చెప్పుకొచ్చారు. గూండా టైంలో జరిగిన ఈ ఉదంతం గతంలో చిరు ఒకసారి పంచుకున్నారు కానీ ఇప్పటి జనరేషన్ ఫ్యాన్స్ కి దాని మీద అవగాహన తక్కువ. గుండాలో ఆయన చేసిన ఫైట్ ఎంత హైలైట్ అయ్యిందో అప్పట్లో థియేటర్లో చూసిన వాళ్లకు బాగా గుర్తు. పత్రికల్లో దీని మీద కథనాలు కూడా వచ్చాయి. పెద్ది పట్ల చిరు ఆనందం మాములుగా లేదు. ఆయన మాటల్లో, ముఖ కవళికల్లో అది స్పష్టంగా కనిపిస్తూ వచ్చింది. పుత్రోత్సాహం అలాగే ఉంటుంది మరి.

This post was last modified on June 24, 2026 11:12 am

Share

Recent Posts

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

1 hour ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

1 hour ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

3 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

5 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

5 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

6 hours ago