సినిమా నటులు రాజకీయాల్లోకి వస్తే… ఈ తరహా మాటలే వినిపిస్తాయి. ఇక రాజకీయాల్లోకి వచ్చిన ఆ సినీ నటులు ఏకంగా అధికార పీఠాన్నే అధిరోహిస్తే… ఈ తరహా విమర్శలు మరింత ఘాటుగా వినిపిస్తాయి. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పైనా ఇదే తరహా ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. గురువారం తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు మొదలు కాగా…విపక్ష డీఎంకే విజయ్ పాలనపై తొలిరోజే విమర్శల జడివానను కురిపించింది. తెరపై హీరో…చేతల్లో జీరో అంటూ రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకుని మరీ డీఎంకే సభ్యులు నిరసనకు దిగారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, జయలలితలు మరణించిన తర్వాత ఆ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ శూన్యతను క్యాష్ చేసుకునే నిమిత్తం రెండేళ్ల క్రితమే తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి దూకేశారు. తమిళగ వెట్రిగ కజగం (టీవీకే) పేరిట రాజకీయ పార్టీని ప్రారంభించిన విజయ్… తన తొలి ఎన్నికల్లోనే గ్రాండ్ విక్టరీ అందుకున్నారు. అప్పటిదాకా అధికార పార్టీగా కొనసాగిన డీఎంకేతో పాటు విపక్ష అన్నాడీఎంకేలకు షాకిచ్చిన టీవీకే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. అయితే స్పష్టమైన మెజారిటీ కోసం కాంగ్రెస్ తో చేతులు కలిపిన విజయ్… మరికొందరు ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం పీఠం ఎక్కేశారు.
రాజకీయాలకు కొత్త అయిన విజయ్ పాలనా తీరు ఎలా ఉంటుందన్న విషయం తెలియడానికి హీనపక్షం ఆరు నెలలు పదడుతుందని భావించిన డీఎంకే అప్పటిదాకా విజయ్ పాలనపై విమర్శలు చేయబోమని వెల్లడించింది. అయితే ఆ మాటను పక్కనపెట్టేసిన డీఎంకే…విజయ్ సీఎం అయ్యాక జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ఆయన పాలనా తీరుపై విమర్శలు గుప్పించింది. గురువారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు డీఎంకే సభ్యులు తెరపై హీరో…చేతల్లో జీరో అంటూ రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకుని మరీ సభలోకి ఎంట్రీ ఇచ్చారు. మొన్నటిదాకా డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన డీఎంకే యువ నేత ఉదయనిధి స్టాలిన్ చేతుల్లోనూ ఈ ప్లకార్డులు కనిపించడం గమనార్హం.
ఇదిలా ఉంటే… అసెంబ్లీ తొలి రోజే డీఎంకే వినూత్న నిరసనలో తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చే విషయంలో విజయ్ ఏమంత రాణించడం లేదని డీఎంకే ఆరోపించింది. విషయం తెలియని నేతల చేతుల్లో రాష్ట్ర పాలన ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆ పార్టీ సభ్యులు నినాదాలు చేశారు.
ఇదే అంశంపై గవర్నర్ ప్రసంగంలో కీలక అంశాలను ప్రస్తావించిన విజయ్ సర్కారు… డీఎంకే మాదిరే కేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగింది. తమిళనాడు గవర్నర్ గా బీజేపీకి అనుకూలురైన అర్లేకర్… విజయ్ సర్కారు ఆమోదించిన ప్రసంగంలో కేంద్రంపై భారీ ఎత్తున విమర్శలు ఉన్నా… ఆ ప్రసంగాన్ని అలాగే చదివేశారు. మొత్తంగా ఎన్నికల బరిలో రాణించిన విజయ్… అసెంబ్లీలో ఇటు విపక్షాలను, అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కొంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది.
This post was last modified on June 18, 2026 1:01 pm
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…
యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…
తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…
ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…