దేశంలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు మార్చి 22న జనతా కర్ఫ్యూ అన్నాడు ప్రధాని నరేంద్ర మోడీ. ఒక్క రోజే కదా.. ఇళ్ల నుంచి బయటికి రాకపోతే ఏమవుతుందిలే అనుకున్నారందరూ. కానీ తర్వాతి రోజు వచ్చి మూడు వారాల లాక్ డౌన్ అంటూ బాంబు పేల్చాడు ప్రధాని.
ఇక అక్కడి నుంచి మొదలైంది ఇంటి వాసం. బయట అన్నీ బంద్. ఇంటిపట్టున మందు కొట్టి ఎంజాయ్ చేద్దామనుకున్న మందుబాబులకు అవకాశమే లేకపోయింది. అప్పటికే ఇంట్లో స్టాక్ పెట్టుకున్న కాస్త మందు కొన్ని రోజుల్లో అయిపోయింది.
లాక్ డౌన్ ఎత్తేస్తారు వైన్ షాపుకు వెళ్దాం అంటే ఛాన్స్ దొరికితే కదా. ఒకటికి రెండుసార్లు లాక్ డౌన్ పొడిగించారు. మరి ఎప్పుడు ఆంక్షలు తొలగిపోతాయో.. వైన్ షాపులు ఎప్పుడు తెరుచుకుంటాయో అని మందుబాబులు ఉత్కంఠగా ఎదురు చూశారు.
దేశవ్యాప్తంగా మరోసారి లాక్ డౌన్ పొడిగించినప్పటికీ.. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు చాలా కష్టంగా మారిన నేపథ్యంలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ప్రభుత్వం. సోమవారం మెజారిటీ రాష్ట్రాల్లో వైన్ షాపులు తెరుచుకున్నాయి. దీంతో ఉదయం నుంచే మందుబాబులు బారులు తీరారు.
ఐతే వైన్ షాపుల దగ్గర జనసందోహం చూశాక.. గంటలు గంటలు ఎదురు చూశాక.. ఇంకోసారి మద్యం దుకాణాలకు రావడం అంత సులువు కాదనిపించిందో.. లేక మళ్లీ ఎక్కడ మద్యం దుకాణాలు మూసేస్తారో అన్న భయం పుట్టిందో కానీ.. ఒకేసారి పెద్ద ఎత్తున స్టాక్ తీసుకెళ్లే ప్రయత్నంలో పడ్డారు మందుబాబులు.
50 వేలకు.. 90 వేలకు మద్యం కొన్న బిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఎంత మందుకు కరువొచ్చినా కూడా ఒకేసారి ఇంత స్టాక్ పట్టుకుపోవాలా అంటూ ఆ బిల్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.
This post was last modified on May 5, 2020 9:25 am
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…