Political News

చిన్ని వర్సెస్ నాని… పీక్స్ కు వెళ్లినట్టే!

కేశినేని శ్రీనివాస్ అలియాస్ కేశినేని నాని… కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్ని… ఇద్దరూ తోడబుట్టిన అన్నదమ్ములే. అంతేనా వారిద్దరూ ఒకే పార్టీతోనే రాజకీయాలు మొదలుపెట్టారు. ఇద్దరూ బెజవాడ నుంచే ఎంపీలుగా విజయం సాధించారు. 2024 ఎన్నికల దాకా ఈ అన్నాదమ్ముల మధ్య ఎంత విభేదాలున్నా బయటకు అయితే రాలేదు. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు కాస్తంత ముందుగా పొడచూపిన విభేదాలతో టీడీపీని వీడిన నాని వైసీపీలో చేరిపోయారు. ఇక అప్పటి నుంచి వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితి. తాజాగా ఎంపీగా ఉన్న తన తమ్ముడిపై నాని ఏకంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కే ఫిర్యాదు చేశారు. వెరసి వీరి మధ్య వైరం పీక్స్ కు వెళ్లిందని చెప్పక తప్పదు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో బెజవాడ లోక్ సభ నుంచి ఈ అన్నాదమ్ములే పోటీ పడగా… అన్నను చిత్తు చేసి తమ్ముడు ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి తమ్ముడిపై భగ్గుమంటున్న నాని… ఎప్పకటిప్పుడు చిన్నిపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో వైసీపీకి దూరంగా జరిగిన నాని…టీడీపీకి చేరువగా జరుగుతున్నా కూడా తమ్ముడిపై తన వైరాన్ని మాత్రం ఆయన వీడటం లేదు. వెరసి వీరిద్దరి మధ్య విభేదాలు ఎక్కడిదాకా వెళతాయోనన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

ఇప్పటికే చిన్నిపై నాని పలుమార్లు అవినీతి ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం చిన్ని చాలా విషయాల్లో అవినీతికి పాల్పడ్డారని, వాటి వివరాలను తెలియజేస్తూ… సదరు అవినీతిపై తక్షణమే సమగ్ర దర్యాప్తు చేయాలని ఆయన నేరుగా ఈడీకే లేఖ రాశారు. ఆ లేఖకు సంబందించిన ప్రతులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈడీకి రాసిన లేఖను నాని..ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడులకు కూడా పంపారు.

ఇక ఈ లేఖలో నాని ఏఏ అంశాలను ప్రస్తావించారన్న విషయానికి వస్తే… వైసీపీ హయాంలో వెలుగు చూసిన లిక్కర్ స్కాంలో చిన్నికి పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా 2024 ఎన్నికల్లో బెజవాడ లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ సీట్లను చిన్ని అమ్ముకున్నారని, ఈ సందర్భంగా ఒక్కో సీటుకు ఆయన రూ.5 కోట్లు తీసుకున్నారని నాని ఆరోపించారు. హైదరాబాద్ కేంద్రంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో ప్రీ లాంచింగ్ పేరిట చిన్ని భారీగా దండుకున్నారని తెలిపారు.

హైదరాబాద్ లోని ప్రగతి నగర్ లో 112 ఎకరాలను చిన్ని కబ్జా చేశారని ఆరోపించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టును కూడా చిన్ని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లో అక్రమాలతో పాటు ఉత్సవాల పేరిట భారీ ఎత్తున అక్రమార్జనకు పాల్పడుతున్నారని, అక్రమ మైనింగ్ చేస్తున్నారని చిన్నిపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటిదాకా జరిగిందే చాలా ఎక్కువ అని, ఇప్పటికైనా చిన్ని అవినీతికి చెక్ పెట్టి తాను పేర్కొన్న అంశాలపై దర్యాప్తు చేపట్టాలని నాని కోరారు. మరి ఈ లేఖపై ఈడీ ఎలా స్పందిస్తుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

This post was last modified on June 13, 2026 9:23 am

Share

Recent Posts

సింగిల్ సింహం సిపిఐతో వస్తుందా?

వైసీపీ అధినేత జగన్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇతర పార్టీలతో ఎప్పుడూ పొత్తులు పెట్టుకోలేదు. ఎన్నికల్లో…

5 minutes ago

చిరు ట్రోల్స్ అన్ని చూస్తున్నారా

మెగాస్టార్ చిరంజీవి ఏ ఈవెంట్‌కు హాజ‌రైనా త‌న‌దైన శైలిలో పంచులు వేస్తూ.. హుషారుగా మాట్లాడే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. తెర మీదే…

13 minutes ago

పెళ్లి కోసం 12 గంటల పెరోల్

పెళ్లంటే నూరేళ్ళ పంట అనేది పాత సినిమాలో హిట్టయిన పాట. హరియాణాకు చెందిన గ్యాంగ్ స్టర్ మైనపాల్ ఢిల్లా మాత్రం…

33 minutes ago

గొప్పలకి పోయి రీల్స్ చేస్తే డబ్బంతా దొంగల పాలయ్యింది

సోష‌ల్ మీడియాలో వ్యూస్ కోసం చేసే రీల్స్ ప్రాణాల మీద‌కు తెస్తున్న విష‌యం తెలిసిందే. రైలు ప‌ట్టాల‌పై ప‌డుకుని, కూర్చుని…

2 hours ago

ప్రియదర్శికి కలిగిన ప్రయోజనం ఎక్కువే

టాలెంట్ లోటు లేకపోయినా కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల ప్రియదర్శి కెరీర్ రెండు హిట్లు నాలుగు ఫ్లాఫుల్లా సాగిపోతోంది.…

10 hours ago

నాయకులు చెబుతున్నా నేతలు కదలడం లేదు

త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఉద్దేశించి టీడీపీ అధినేత‌, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు సీరియ‌స్‌గా ఉన్న…

10 hours ago