Movie News

సత్యదేవ్ మరీ ఎక్కువ మాట్లాడేశాడా?

ఈ రోజుల్లో పెద్ద సినిమాల‌కే ఆశించిన స్థాయిలో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం లేదు. అలాంట‌పుడు చిన్న స్థాయి సినిమాల‌ను జ‌నాల్లోకి తీసుకెళ్ల‌డం, వారికి థియేట‌ర్ల‌కు తీసుకురావ‌డం స‌వాలుగా మారిపోయింది. ఈ నేప‌థ్యంలో త‌మ చిత్రాల గురించి ఫిలిం మేక‌ర్స్ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. లేదంటే లేని పోని కాంట్ర‌వ‌ర్శీలు కూడా లేవ‌నెత్తుతున్నారు.

సినిమాను ప్ర‌మోట్ చేయ‌డంలో వారి తాప‌త్ర‌యం అర్థం చేసుకోద‌గ్గ‌దే కానీ.. కొన్నిసార్లు వాళ్లిచ్చే స్టేట్మెంట్లకు త‌గ్గ‌ట్లు సినిమా లేక‌పోతే అవి ట్రోల్ మెటీరియ‌ల్స్‌గా మారిపోయే ప్ర‌మాద‌మూ ఉంటుంది. జులై 3న తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న రావు బ‌హ‌దూర్ సినిమా గురించి హీరో స‌త్య‌దేవ్ ఇచ్చిన స్టేట్మెంట్లు కొంచెం అతిగానే అనిపిస్తున్నాయి సోష‌ల్ మీడియా జ‌నాల‌కు.

మ‌హేష్ బాబు నిర్మాణంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని కేరాఫ్ కంచ‌ర‌పాలెం ద‌ర్శ‌కుడు వెంకటేష్ మ‌హా రూపొందించాడు. ఇంత‌కుముందు రిలీజ్ చేసిన రావు బ‌హ‌దూర్ గ్లింప్స్, తాజాగా లాంచ్ చేసిన టీజ‌ర్ చాలా కొత్త‌గా, ప్రామిసింగ్‌గా అనిపించిన మాట వాస్త‌వం. విజువ‌ల్స్.. కాన్సెప్ట్ స్ట‌న్నింగ్‌గా అనిపించాయి.

కెరీర్లో ఇప్ప‌టికే ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసినా హీరోగా స‌రైన బ్రేక్ రాక ఇబ్బంది ప‌డుతున్న స‌త్య‌దేవ్‌.. ఈ చిత్రం తాను కోరుకునే బ్రేక్ ఇస్తుంద‌ని ఆశిస్తున్నాడు. కెరీర్లో బిగ్గెస్ట్, మోస్ట్ ప్రామిసింగ్ మూవీ చేసిన ఎగ్జైట్మెట్లో అత‌ను త‌న చిత్రాన్ని బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ లాంటి మెగా మూవీస్‌తో పోల్చేసుకున్నాడు.

ఆ సినిమాల గురించి ఇత‌ర ఇండ‌స్ట్రీల వాళ్లు ఎలా మాట్లాడుకుంటారో.. రావు బ‌హ‌దూర్ గురించి కూడా అలాగే చ‌ర్చించుకుంటార‌ని.. మ‌న వాళ్లు ఎప్పుడూ ఇత‌ర భాష‌ల్లో వ‌చ్చిన గొప్ప సినిమాల గురించి మాట్లాడుతుంటార‌ని, అలాగే రావు బ‌హ‌దూర్ దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అవుతుంద‌ని అత‌న‌న్నాడు.

అంతే కాక వెంక‌టేష్ మ‌హా క‌ల్ట్ మూవీ కేరాఫ్ కంచ‌రపాలెం చిత్రాన్ని రావు బ‌హ‌దూర్ బ్రేక్ ఫాస్ట్‌లో తినేస్తుంద‌ని కూడా స‌త్య‌దేవ్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. సినిమా మీద న‌మ్మ‌కం ఉండ‌డం మంచిదే కానీ.. ఇలా మ‌రీ పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేస్తే, సినిమా అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు లేని ప‌క్షంలో విమ‌ర్శ‌లు ఎలా ఉంటాయో కూడా దృష్టిలో ఉంచుకుంటే మంచిదేమో. ఈ ఈవెంట్లో మిగతా టీమ్ సభ్యులు సైతం రావు బహదూర్ గురించి మరీ ఎక్కువ చెప్పుకున్నారనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.

This post was last modified on June 13, 2026 6:27 am

Share

Recent Posts

దాదాకున్న సమయం తక్కువే కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…

37 minutes ago

రణబాలి… దర్శకుడి క్లారిటీ సూపర్

ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…

2 hours ago

విశాఖ‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తి… ఈ మూడే కూట‌మికి కీల‌కం!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూట‌మికి కీల‌కంగా మారిన మూడు మునిసిప‌ల్‌ కార్పొరేష‌న్ల వ్య‌వ‌హారం.. ఆస‌క్తిగా మారింది. రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాదు..…

2 hours ago

ఏఐతో 100 కోట్ల ప్రాణాలకు ముప్పు?

సాంకేతిక రంగంలో పెను విప్లవానికి దారి తీస్తున్న ఏఐ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే ప్రపంచాన్ని హడలెత్తిస్తుంది. అణ్వాయుధాల కంటే…

2 hours ago

కాంగ్రెస్ వైపు జగన్ అడుగులు?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మాసరుస్తున్నారా..? నిన్నా మొన్నటి వరకు ప్రధాని మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కొనసాగిన…

4 hours ago

ఉన్న కాస్త సింపతీ పోతుంది జగన్

ఒక పార్టీపై చ‌ర్య‌లు తీసుకున్నా.. ఒక పార్టీ నాయ‌కుడిపై చ‌ర్య‌లు తీసుకున్నా.. స‌హ‌జంగానే ప్ర‌జ‌ల్లో అంతో ఇంతో సింప‌తీ ద‌క్కుతుంది.…

5 hours ago