Political News

పవన్ అంతే… ఏదైనా పూర్తిగా తెలియాల్సిందే!

జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాలకు కొత్తే. సినిమా నటుడిగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతున్న పవన్.. ఓ దశాబ్దం క్రితం మాత్రమే రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చాక 12 ఏళ్లకు గానీ ఆయనకు పదవి దక్కలేదు. అయితేనేం… పాలనలో సత్తా చాటుతున్నారు.

రెండు, మూడు సార్లు మంత్రులుగా పనిచేసినవ వారి కంటే కూడా పవన్ మెరుగ్గా రాణిస్తున్నారు. ఇందుకు ఆయన దృక్పథమే కారణమని చెప్పక తప్పదు. ఏ విషయాన్ని అయినా పవన్ పట్టారంటే… దానిని పూర్తిగా తెలుసుకోవడంతో పాటుగా అందులోని లోటుపాట్లను కూడా అధ్యయనం చేయనిది పవన్ నిద్రపోరు. ఈ రకమైన తీరుతోనే పవన్ సత్తా చాటుతున్నారు.

ఇటీవలే గోదావరి పుష్కర ఏర్పాట్లను పరిశీలించేందుకు పవన్ రాజమహేంద్రవరం వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రెండు రోజుల పాటు పూర్తిగా అక్కడే ఉండి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది అన్న దానిపై ఆయన సమగ్ర అధ్యయనం చేశారు. గోదాట్లోకి వెళుతున్న కాలుష్యాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన… అసలు కాలుష్యాలు గోదాట్లోకి ఎందుకు చేరుతున్నాయన్న దిశగా ఆలోచన చేశారు. చెత్తా చెదారాన్ని మనం అలా పడేస్తున్నాం. పరిశ్రమలూ తమ వ్యర్థాలను అలా నదుల్లోకి వదిలేస్తున్నాయి. ఫలితంగా గోదారి జలాలు కాలుష్యం అవుతున్నాయి. మరి దీనికి విరుగుడేంటి? అన్నదానిపైనే పవన్ తన టూర్ లో దృష్టి సారించారు.

కాలుష్య నివారణకు పవన్ ఓ డీటెయిల్డ్ ప్లాన్ ను విడుదల చేశారు. అంతటితో ఆగని పవన్… శనివారం పల్నాడు జిల్లా టూర్ కు వెళ్లారు. ఎందుకోసమంటే… ఆ జిల్లా పరిధిలోని జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ ను సందర్శించడానికే ఆయన పల్నాడు టూర్ పెట్టుకున్నారు. జిల్లా పరిధిలోని కొండవీడు గ్రామంలో జిందాల్ సంస్థ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ ను ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ లో మన ఇళ్లల్లో నుంచి, పరిశ్రమల నుంచి వస్తున్న వేస్ట్ ను వినియోగించి విద్యుత్ ను తయారు చేస్తోంది. ఈ ప్లాంట్ ను సమగ్రంగా అధ్యయనం చేసేందుకే పవన్ ఏకంగా ఆ పరిశ్రమ వద్దకే వెళ్లారు.

ఈ సందర్భంగా జిందాల్ పరిశ్రమలో చెత్తను ఏం చేస్తున్నారన్న విషయంపై పవన్ సమగ్ర అధ్యయనం చేశారు. చెత్తను ఆ పరిశ్రమలో ఎలా ప్రాసెస్ చేస్తున్నారు? దాని నుంచి విద్యుత్ ను ఎలా తయారు చేస్తున్నారు? అందుకు ఆ సంస్థ వినియోగిస్తున్న యంత్రాలు ఏమిటి? వాడుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఏమిటి? అన్న విషయాలను పవన్ సమగ్రంగా పరిశీలించారు. అంతేకాకుండా ఆయా అంశాలపై ఆయన పరిశ్రమ ఉద్యోగులు, అదికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చెత్తను ఆ సంస్థ ప్రాసెస్ చేస్తున్న విధానాన్ని పవన్ ఆసక్తిగా తిలకిస్తున్న వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

This post was last modified on May 30, 2026 5:04 pm

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

35 minutes ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

2 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

2 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

2 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

4 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

5 hours ago