Political News

ప‌సుపు సేన‌-జ‌న‌సేన‌.. ఇక‌, తిరుగులేదుగా!

ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న రెండు పార్టీల మధ్య సమన్వయం సాధించే దిశగా పై స్థాయిలో మార్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇటు టిడిపిలోను అటు జనసేనను నాయకత్వాన్ని ముందుకు నడిపించేందుకు క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించేందుకు ఉమ్మడిగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించారు. దీనికి సంబంధించి మహానాడులో తీసుకున్న నిర్ణయం ప్రకారం అటు పసుపు సేన ఇటు జనసేన నాయకులను కార్యకర్తలను ముందుండి నడిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను ఈ కమిటీ నిర్ణయించనుంది.

దీని ప్రకారం క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల కార్యకర్తలను నాయకులను కూడా సమన్వయం చేయడంతో పాటు ఉమ్మడిగా కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వ ప్రాధాన్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లే విషయంలో నూ ఈ కమిటీ కీలక పాత్ర పోషించనుంది. ఫలితంగా ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో కొంతమేరకు ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొంటున్న అనేక నియోజకవర్గాల్లో మార్పులు వస్తాయని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో కలిసికట్టుగా ప్రజల మధ్యకు వెళ్లడంతో పాటు ప్రజల సమస్యలను ప్రస్తావించి వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేసేందుకు ఈ ప్రయత్నం ఫలిస్తుందని భావిస్తున్నారు.

వాస్తవానికి ఇప్పటివరకు ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో గత ఎన్నికలకు ముందు ఉన్న కలివిడితనం ఈ రెండు పార్టీలలో ఇప్పుడు లోపిస్తోంది. నాయకుల మధ్య.. విభేదాలు వివాదాలు, కామన్ గా మారాయి. దీంతో వచ్చే ఎన్నికల వరకు వేచి చూస్తే ఇబ్బందికర పరిణామాలు తప్పవని భావించిన పార్టీలు ఉమ్మడిగా సమన్వయం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తాజాగా మహానాడులో కూడా ఈ విషయంపై చర్చించారు.

ప్రధానంగా కలిసి ముందుకు సాగడం ద్వారా పార్టీలను బలోపేతం చేయడం ద్వారా మాత్రమే మళ్ళీ విజయం సాధించగలం అన్న బలమైన సంకేతాన్ని టిడిపి శ్రేణులకు పంపించినట్టు అయింది. సో ఈ క్రమంలోనే పసుపు సేన -జనసేన నాయకులు, కార్యకర్తలు మధ్య సమన్వయం క‌ల్పించేందుకు క‌మిటీని ఏర్పాటు చేసి ప్రజల మధ్య కు వెళ్లేందుకు అవకాశం కలిపించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇది సక్సెస్ అయితే ఇక క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వంతో పాటు కార్యకర్తలను నడిపించేందుకు అవకాశం కూడా ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు.

This post was last modified on May 29, 2026 6:03 pm

Share

Recent Posts

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

1 hour ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

2 hours ago

కళ్యాణ్ గుండె ధైర్యం గట్టిదే

అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…

2 hours ago

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

3 hours ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

4 hours ago

ఐకానిక్ షోకు తెర‌… చివ‌రి సీజ‌న్లో అల్లు అర్జున్‌?

ఇండియాలో వివిధ భాష‌ల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపుల‌ర్ ఏది అంటే బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత…

5 hours ago