తెలుగు సినీ సంగీత చరిత్రలోనే అత్యంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్లలో మణిశర్మ ఒకడు. 90వ దశకం చివరి నుంచి మొదలుపెడితే ఒక దశాబ్దం పాటు ఆయన హవా మామూలుగా సాగలేదు. ముందుతరం సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతో పాటు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి నవతరం సూపర్ స్టార్లతోనూ భారీ మ్యూజికల్ హిట్లు ఇచ్చి తెలుగు సినీ సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన ఘనత ఆయన సొంతం.
మాస్‌తో పాటు క్లాస్‌కూ నచ్చేలా పాటలు, బీజీఎం ఇవ్వడంలో ఆయన శైలే వేరు. కానీ ఆర్పీ పట్నాయక్, చక్రి, దేవిశ్రీ ప్రసాద్, తమన్ లాంటి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ల రాకతో క్రమంగా మణిశర్మ ఆధిపత్యం తగ్గుతూ వచ్చింది. పూర్తిగా సంగీతం పక్కన పెట్టేయలేదు కానీ.. మునుపట్లా బిజీగా అయితే లేరు మణిశర్మ.
తన స్థాయికి తగని సినిమాలు చేయడం, సంగీతంతో పెద్దగా ప్రభావం చూపకపోవడంతో క్రమంగా అందరూ ఆయన్ని మరిచిపోవడం మొదలుపెట్టారు.
ఇలాంటి టైంలో బేబీ సినిమా మేకర్స్ కొత్త సినిమా చెన్నై లవ్ స్టోరీ కోసం మణిశర్మను ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలాంటి యూత్ ఫుల్ లవ్ స్టోరీకి మణిశర్మ లాంటి ముందు తరం మ్యూజిక్ డైరెక్టర్‌ను ఎంచుకోవడమేంటా అనుకున్నారంతా. కానీ మణిశర్మతో కూర్చుని, ఒక అభిరుచితో పని చేయించుకుంటే.. ఔట్ పుట్ ఎలా ఉంటుందో ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి రిలీజైన రెండు పాటలు వింటే అర్థమైపోతుంది.
ఈ పాటలను లాంచ్ చేసిన తీరు, ఇందుకోసం నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్లు, ఆ పాటల లిరికల్ వీడియోస్ చూస్తే.. మణిశర్మకు కెరీర్లో ఈ దశలో ఒక ట్రిబ్యూట్ ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. తొలి ప్రేమే పాట లాంచ్ కోసం మణిశర్మ మీదే ఒక బడ్జెట్ పెట్టి మేకింగ్ వీడియో కూడా చేసింది చిత్ర బృందం.
ఇప్పుడేమో రెండో పాట లాంచ్ కోసం కీరవాణి సహా అనేక మంది సినీ ప్రముఖులను రప్పించి మణిశర్మతో వారి అనుబంధాన్ని చెప్పిస్తూ ఈవెంట్ చేశారు. పాట లాంచ్ అయ్యాక కోటి, దేవిశ్రీ ప్రసాద్ లాంటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్లతో మణిశర్మ గురించి బైట్స్ ఇప్పించడం విశేషం.
ఇదంతా చూస్తే మణిశర్మపై చెన్నై లవ్ స్టోరీ టీంకు, తోటి సంగీత దర్శకులకు ఎంత ప్రేమ ఉందో కూడా అర్థమవుతోంది. అందరూ ఆశిస్తున్నట్లు చెన్నై లవ్ స్టోరీతో మళ్లీ మణిశర్మ బలమైన ముద్రే వేసేలాగే కనిపిస్తున్నారు.
This post was last modified on May 27, 2026 4:48 am
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…