Political News

రాహుల్ కాదంటే… రేవంతే ప్ర‌ధానా?!

రాహుల్ గాంధీకి ప్ర‌ధాన మంత్రి ప‌ద‌విపై మోజులేదు. నేనే చెప్పి ఒప్పించా. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనే రాహుల్ ను ప్ర‌దానిని చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తాం. అని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల కింద‌ట చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇంకా చ‌ర్చ‌కు వ‌స్తూనే ఉన్నాయి. వాస్త‌వానికి రాహుల్‌ను ప్ర‌ధానిని చేయాల‌ని.. అనేక సంవ‌త్స‌రాలుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

ఈ క్ర‌మంలోనే దేశ‌వ్యాప్తంగా రాహుల్ కోసం.. ఉద్య‌మాల‌కు కూడా కొంద‌రు నాయ‌కులు శ్రీకారం చుట్టారు. ఇక‌, ఇప్ప‌టికీ.. రాహుల్‌కు ప్ర‌ధాని కావాల‌ని లేద‌న్న దానిలో వాస్త‌వం ఉందో లేదో రేవంత్ ఆలోచ‌న చేసుకోవాలి. మ‌రోవైపు.. రాహుల్ ఇప్ప‌టికీ ప్ర‌ధాని కాదంటే..ఆ ప‌ద‌విని రేవంత్ తీసుకుంటారా? అనే చ‌ర్చ కూడా తెర‌మీదికి వ‌చ్చింది.

2034 నాటికి తాను జాతీయ స్థాయిలో రాజ‌కీయాలు చేయాల‌ని భావిస్తున్న‌ట్టు చెబుతున్న రేవంత్ ఉద్దేశాన్ని ఎద‌రూ కాద‌న‌రు. ఇదే జ‌రిగితే.. పీవీ న‌రసింహారావు త‌ర్వాత‌.. ఆ స్థాయిని చేరుకునే నాయ‌కుడిగా రేవంత్‌కు గుర్తింపు ల‌భిస్తుంది. నాడు.. పీవీని కూడా రాష్ట్ర నాయ‌కుడిగా ఉన్న‌ప్ప‌టికీ.. జాతీయ‌స్థాయి నాయ‌కుడిగా ఇందిరా గాంధీ ఆహ్వానించారు. ఇప్పుడు రేవంత్‌ను రాహుల్ ఆహ్వానిస్తున్నారు.

ఈ క్ర‌మంలో రాహుల్‌ను ప్ర‌ధానిని చేయాల‌న్న‌ది రేవంత్ చెబుతున్న మాట‌. రేవంత్ జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్లి.. రాహుల్‌ను ప్ర‌ధాని చేయ‌డ‌మే ల‌క్ష్య‌మైతే.. మంచిదే. కానీ, తానే ప్ర‌ధాని కావాల‌న్న ఉద్దేశం కూడా ఆయ‌న మాటల్లో తొణికిస లాడింది. ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీ కూడా.. త‌న‌తో చేతులు క‌లిపితే.. ఉండే అవ‌కాశం(రాజ‌కీయం) వేరేగా ఉంటుంద‌ని వ్యాఖ్యానించారు. ఈ ప‌రిణామాల క్ర‌మంలోనే రేవంత్ రెడ్డి వ్యూహాత్మ‌కంగా వ్యాఖ్యానించార‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on May 19, 2026 1:13 pm

Share

Recent Posts

బాబాయ్ గొడ్డలి జపమైపోయింది

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…

17 minutes ago

సుకుమార్ ఏం మార్పు కోరుకుంటున్నట్లు?

పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…

39 minutes ago

రేట్లు కావాలి కానీ రజినీ రాడు

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…

1 hour ago

ముగ్గుర్ని చంపేస్తే నాన్న చూసుకుంటాడా?

ఈ మధ్యకాలంలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇక, కొందరు డబ్బున్న బడాబాబుల పిల్లలు, కొందరు రాజకీయ నాయకుల…

1 hour ago

రామాయణం కన్నా ఆదిపురుష్ నయం ఏమో?

‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు దాని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించినపుడు అందరికీ…

2 hours ago

డిజాస్టర్ హీరోతో డిజాస్టర్ డైరెక్టర్?

‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు యశ్. కేజీఎఫ్-2 తర్వాత అతను ఎలాంటి చిత్రం చేస్తాడా అని…

2 hours ago