Political News

సీఎం వెనుక దర్శకుడి పట్టుదల

విజయ్ భవిష్యత్తుని ముందే ఊహించాడు అనడం కంటే, వెంకట్ ప్రభు దాన్ని తెర మీద పట్టుబట్టి చూపించాడు అనడం కరెక్ట్. ‘GOAT’ సినిమాలో ‘TN07 CM 2026’ నంబర్ ప్లేట్ పెట్టినప్పుడు చాలామంది నవ్వారు. హీరోని పొగడటం కామన్. ప్రతి దర్శకుడూ తన హీరోని పవర్‌ఫుల్‌గానే చూపిస్తాడు. కానీ ఏకంగా సీఎం అనేసరికి “ఇది ఓవర్” అనే కామెంట్స్ వచ్చాయి. అయినా వెంకట్ ప్రభు వెనక్కి తగ్గలేదు.

యూనిట్ టాక్ ప్రకారం ఆ సీన్‌కి విజయ్ మొదట ఒప్పుకోలేదట. రాజకీయ కలర్ వస్తుంది, ఇప్పుడే వద్దు అని చెప్పాడట. కానీ వెంకట్ ప్రభు మాత్రం ఇది ఉంటేనే కిక్. ఫ్యాన్స్‌కి పూనకాలు వస్తాయి అని పట్టుబట్టాడట. దర్శకుడిగా తనకి ఉన్న కమర్షియల్ సెన్స్‌తో ఆ సీన్‌కి సీఎం వైబ్స్ తీసుకొచ్చాడు. సెట్స్‌లో కూడా దీని మీద చర్చ జరిగిందట. ఫైనల్‌గా దర్శకుడు చెప్పిందే ఫైనల్ అయింది. ఆ ఒక్క షాట్ సినిమాలో 3 సెకన్లు కనిపిస్తుంది. థియేటర్‌లో మాత్రం విజిల్స్ పడ్డాయి.

కట్ చేస్తే ఏడాదిన్నర తిరిగేసరికి సీన్ రివర్స్ అయ్యింది. విజయ్ నిజంగానే తమిళనాడు సీఎం అయ్యాడు. అప్పుడు ఓవర్ అన్న వాళ్లే “VPకి దూరదృష్టి ఉంది” అన్నారు. కానీ ఇది ఊహ కాదు. ఇది రిస్క్. హీరో వద్దు అన్నా, ట్రోల్స్ వస్తాయని తెలిసినా ఆ ఎలివేషన్ ఇవ్వడం అంటే దర్శకుడికి కాన్ఫిడెన్స్ ఉండాలి. వెంకట్ ప్రభు ఆ కాన్ఫిడెన్స్‌ని నమ్మాడు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ మీద అతనికి క్లారిటీ ఉండి ఉండొచ్చు. లేదా ఫ్యాన్ బాయ్ శాంపిల్‌గా అలా పెట్టి ఉండొచ్చు. రీజన్ ఏదైనా రిజల్ట్ మాత్రం VPకి ప్లస్ అయింది.

ఇప్పుడు అదే నంబర్ ప్లేట్‌ని ఫ్రేమ్ కట్టి విజయ్‌కి ఇచ్చాడు వెంకట్ ప్రభు. ‘THE FIRST MANIFESTATION’ అని రాయించాడు. ఫోటో చూస్తే ఇద్దరి మొహాల్లో హ్యాపీ కనిపిస్తుంది. ఒకరు హీరో నుంచి సీఎం అయ్యాడు. ఇంకొకరు ఆ జర్నీని తెర మీద ముందే చూపించిన క్రెడిట్ తీసుకున్నాడు. సినిమా హిస్టరీలో హీరోకి ఎలివేషన్ ఇచ్చిన దర్శకులు చాలామంది ఉన్నారు. కానీ హీరో రియల్ లైఫ్‌ని స్క్రీన్ మీద పెట్టి, అది నిజం చేశానని ప్రూవ్ చేసుకున్న దర్శకుడు మాత్రం వెంకట్ ప్రభు ఒక్కడే.

This post was last modified on May 19, 2026 11:54 am

Share

Recent Posts

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

4 hours ago

తెలంగాణా కాంగ్రెస్లో టిక్.. టిక్.. టిక్

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…

7 hours ago

రంభ ఊర్వశి సరే… మరి అప్పట్లో ఎలా

సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…

7 hours ago

అభిమానుల విన్నపం నాగ్ పట్టించుకోలేదా

వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…

7 hours ago

భారత్ లోనే వివాహం చేసుకోండి

భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…

10 hours ago

జగన్ కేసుల లోగుట్టు సాయిరెడ్డి విప్పనున్నారా?

వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…

11 hours ago