Political News

డిప్యూటీ పవన్ సార్ బ్యాక్ టు డ్యూటీ

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురువారం అమరావతి చేరుకున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమరావతిలోని సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ మేరకు కేబినెట్ భేటీకి పవన్ హాజరైన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇటీవలే శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ పెద్దగా విరామం ఏమీ తీసుకోకుండానే ఏపీ ప్రజలు తనకు అప్పగించిన బాధ్యతల్లోకి ఒరిగిపోయారు. ఇతర మంత్రివర్గ సహచరులతో కలిసి పవన్ కేబినెట్ భేటీకి హాజరైనట్లుగా డిప్యూటీ సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.

శ్వాస సంబంధిత సమస్యలతో గత కొంతకాలంగా సతమతమైన పవన్… ఆ సమస్య మరింత పెద్దదిగా మారే ప్రమాదం ఉండటంతో వైద్యుల సలహా మేరకు ఇటీవలే ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆపరేషన్ చేయించుకుని హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ను సీఎం చంద్రబాబు ఇటీవలే పరామర్శించారు. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన హైదరాబాద్ పర్యటనలో భాగంగా పవన్ ఇంటికి వెళ్లారు. పవన్ అనారోగ్యంపై ఆరా తీసిన మోదీ… పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ప్రధాని మోదీ తన ఇంటికి వచ్చిన సందర్భంగానూ పవన్ ఓ మోస్తరు అలసటతోనే కనిపించారు. నాటి ఫొటోలు చూసిన వారంతా… పవన్ ఇంకా కోలుకోలేదని భావించారు. అయితే అందరికీ షాకిస్తూ గురువారం పవన్ హైదరాబాద్ నుంచి నేరుగా అమరావతి చేరుకున్నారు. మునుపటి మాదిరే ఉత్సాహంగా కనిపించిన పవన్.. కేబినెట్ బేటీలో కీలక అంశాలపై ఆసక్తికర చర్చలు చేశారు. మొత్తంగా తన ఆరోగ్యంపై రేకెత్తుతున్న ఆందోళనలను పవన్ ఒక్క దెబ్బతో కొట్టిపారేశారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

This post was last modified on May 14, 2026 1:26 pm

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

56 minutes ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

2 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

2 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

2 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

2 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

4 hours ago