Political News

తమిళనాట సంచలన పొత్తు… నిజమెంత?

తమిళనాడు రాజకీయం రంజుగా సాగుతోంది. గతంలో ఎన్నడూ లేనన్ని ట్విస్టులు అక్కడ చోటుచేసుకుంటున్నాయి. ఇందుకు కారణం నిన్నటిదాకా అక్కడ ఉన్నవి రెండు పార్టీలే. ఇప్పుడు ప్రధాన పార్టీల సంఖ్య రెండు నుంచి మూడుకు చేరింది. అంతేకాకుండా నిన్నటిదాకా ఓ సారి నీకు, ఓ సారి నాకు అంటూ అధికారం పంచుకుంటూ వస్తున్న డీఎంకే, అన్నాడీఎంకేలను ఇప్పుడు కొత్తగా వచ్చిన విజయ్ పార్టీ టీవీకే చిత్తు చేసింది.

విజయ్ కొట్టిన దెబ్బకు ఆ రెండు పార్టీల మైండ్ బ్లాంకైందని చెప్పక తప్పదు. తమ ఇద్దరినీ ఓడించిన విజయ్ ని తామెందుకు ఇబ్బంది పెట్టకూడదన్న కోణంలో ఆలోచించిన ఆ రెండు పార్టీలు ఇప్పుడు ఏకమయ్యే దిశగా సాగుతున్నాయన్న వార్తలు ఇప్పుడు యావత్తు దేశాన్ని విభ్రమకు గురి చేస్తున్నాయి.

తమిళ అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 234. తాజా ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేలను దాటేసిన టీవీకే ఏకంగా 107 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకేకు ఇంకో 11 సీట్లు కావాల్సి ఉంది. డీఎంకే, అన్నాడీఎంకేలు కాకుండా అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను విజయ్ పార్టీ పరిశీలిస్తున్న తరుణంలో…

విజయ్ స్పీడుకు బ్రేకులేస్తూ డీఎంకే, అన్నాడీఎంకే రసవత్తర రాజకీయ చదరంగానికి తెర తీశాయి. విజయ్ ని నిలువరించి… తిరిగీ తమ చేతుల్లోనే అధికారం ఉండేలా ఆ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటిదాకా పరస్పరం వాదులాడుకున్న ఆ రెండు పార్టీలు ఏకమయ్యేందుకూ సిద్ధపడిపోయాయి.

ఈ దిశగా అన్నాడీఎంకే, డీఎంకేల మధ్య చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు తమిళ ప్రజలను షాక్ కు గురి చేశాయని చెప్పాలి. అయితే ఈ వార్తలు నిజం కాదంటూ డీఎంకే ఓ బహిరంగ ఖండనను విడుదల చేసింది.

అయినా కూడా ఆ పార్టీ అన్నాడీఎంకేతో చర్చలు జరుపుతూనే ఉందంటూ మరిన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మొత్తంగా నిన్నటిదాకా కొట్టుకున్న ఈ రెండు పార్టీలు… తామిద్దరినీ జాయింట్ గా ఓడించేసిన విజయ్ ని నిలువరించేందుకు కలిసిపోవడం ఖాయమేనన్న వాదనలూ ఆసక్తి రేపుతున్నాయి.

ఈ విషయాలు పుకార్లుగా షికారు చేస్తున్నా… విజయ్ ని నిలువరించేందుకు ఈ రెండు పార్టీలు కలిసే అవకాశం చాలా తక్కువేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే… జోడీ కడుతూ తాము నిర్ణయం తీసుకుంటే… భవిష్యత్తులో జనంలో బాగా పలుచబడిపోతామన్న భయం అటు డీఎంకేతో పాటు అన్నాడీఎంకేను వేధిస్తోందని వారు చెబుతున్నారు.

విజయానికి అతి చేరువకు వచ్చి నిలబడ్డ విజయ్ ని సీఎం పీఠం ఎక్కకుండా చేయడం దుర్లభమని కూడా ఆ రెండు పార్టీలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే గవర్నర్ ను కలిసిన విజయ్… గురువారం ఉదయం సీఎంగా ప్రమాణం చేసేందుకు కార్యరంగం సిద్ధమైన నేపథ్యంలో… ఇప్పుడు విజయ్ కి బ్రేకులు వేయడం సమంజసం కాదని ఆ రెండు పార్టీల్లోని పలువురు సీనియర్ నేతలు చెబుతున్నట్లుగా సమాచారం. చూద్దాం…మరి ఏం జరుగుతుందో?

This post was last modified on May 6, 2026 11:19 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

2 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

3 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

3 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

4 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

4 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

5 hours ago