Political News

వకీల్ సాబ్‌ను చెప్తున్నా.. సీఎం సాబ్ జాగ్రత్త


పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీలో ఉన్నపుడు ఎంత దూకుడుగా, ఆవేశంగా మాట్లాడేవారో తెలిసిందే. యువతకు నచ్చేది ఆ దూకుడే. కానీ ఆయన సొంతంగా పార్టీ పెట్టాక మాత్రం ఆవేశం తగ్గించుకున్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఆవేశపడితే, నోరు జారితో బాగుండదని అనుకున్నారో ఏమో. పార్టీ పెట్టిన కొత్తలో, గత ఎన్నికలకు ముందు అయినా అప్పుడప్పుడూ కొంత ఆవేశం చూపించేవాడు, దూకుడుగా మాట్లాడేవాడు కానీ.. ఈ మధ్య మాత్రం మరీ సాత్వికంగా తయారయ్యాడు. ప్రత్యర్థుల మీద విమర్శలు చేసేటపుడు కూడా ఆయన మాటలు పదునుగా ఉండట్లేదు.

ఈ రోజుల్లో ఇలా ఉంటే చాలా కష్టం అని.. దూకుడు పెంచాలని అభిమానులు, పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నా పవన్ మాత్రం సాఫ్ట్‌గానే మాట్లాడుతున్నాడు. ఐతే ఇటీవల వరద వల్ల నష్టపోయిన రైతుల కోసం పార్టీ తరఫున పోరాటం మొదలుపెట్టిన పవన్.. స్వరం మార్చాడు. తాజాగా మచిలీపట్నం పర్యటనలో పవన్ అధికార పార్టీ మీద పదునైన పంచ్‌లు విసిరి అభిమానుల్లో వేడి పుట్టించారు.

తన కొత్త సినిమా ‘వకీల్ సాబ్’ పేరును పవన్ ఈ పర్యటన ఉచ్ఛరించడం విశేషం. తనపై తరచుగా విమర్శలు చేస్తున్న పేర్ని నానీని ఉద్దేశించి పవన్ పంచ్ డైలాగులు పేల్చాడు. ‘‘శతకోటి లింగాల్లో ఓ బోడి లింగం అంటారు. అలాగే శతకోటి నానీల్లో ఒక నానికి చెబుతున్నా. మీ సీఎం సాబ్‌కు చిదతలు కొడితే కొట్టుకో, నన్ను తిడితేనే నీ మంత్రి పదవి ఉంటుందంటే తిట్టుకో నాకేం పర్వాలేదు. కానీ రైతులకు అండగా నిలబడాలి. ఏమయ్యా నానీ. నువ్వు నన్ను తిట్టింది చాల్లే కానీ పోయి పనికొచ్చే పని ఏదైనా చేయవయ్యా. వైసీపీ నాయకులారా.. శృతిమించితే మీపై పోరాటం చేస్తాం. ఈ విషయం సీఎం సాబ్‌కి వకీల్ సాబ్ చెప్పాడని చెప్పండి. రైతులకు న్యాయం చేయకపోతే మిమ్మల్ని రోడ్డు మీదకు తీసుకొస్తాం జాగ్రత్త. మీ వైఎస్సార్ సీపీ నాయకులు నాయకులు నోరేసుకుని రోడ్లమీదకు వస్తే మేము రాలేమనుకుంటున్నారా జగన్ రెడ్డీ. మేము కూడా రోడ్లమీదకు వస్తాం సిద్ధంగా ఉండండి, తేల్చుకుందాం రైతులకు ఎకరానికి 35 వేలు పరిహారం ఇవ్వకపోతే అసెంబ్లీని ముట్టడిస్తాం ఇది తథ్యం సీఎం సాబ్. కానీ రైతులకు అన్యాయం జరిగితే మాత్రం రోడ్డుకు మీదకు తీసుకోస్తాం. మీరు జనసేనకు భయపడి అసెంబ్లీ సమావేశాలు పులివెందులలో పెట్టుకున్నా సరే వచ్చి ముట్టడిస్తాం జాగ్రత్త’’ అంటూ పవన్ పంచ్‌ల మీద పంచ్‌లు వేసి రోడ్ షోకు హాజరైన జనసేన కార్యకర్తలు, జనాల్లో హుషారు పుట్టించాడు.

This post was last modified on December 28, 2020 6:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

29 minutes ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

3 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

5 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago