తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం స్టాలిన్‌కు తిరుగులేదని సర్వేలు చాటి చెప్పాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు.. అధికార పార్టీ డీఎంకే వైపే మొగ్గు చూశాయి. ఈ నెల 23న ఒకే విడతలో ఇక్కడ ఎన్నికలు జరిగాయి. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్రంలో డీఎంకే+ కాంగ్రెస్+ ఇతర చిన్నాచితకా పార్టీలు కలిసి పొత్తుతో ఎన్నికలకు వెళ్లాయి. ఇదే సమయంలో మాజీ సీఎం జయలలిత పార్టీ అన్నాడీఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల సమరంలో నిలిచింది. ఇక, నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం(టీవీకే) ఒంటరి పోరుకు దిగింది. మొత్తంగా అనేక వ్యూహాలు.. ప్రతివ్యూహాలతో ఈ ఎన్నికలు సాగాయి.
ఈ క్రమంలో మహిళా రిజర్వేషన్ సహా.. అనే అంశాలు ఎన్నికలను ప్రభావితం చేశాయని తెలుస్తోంది. అదేసమయంలో డీఎంకే కుటుంబ పాలన, అవినీతి అక్రమాలను బీజేపీ ప్రధానంగా ప్రస్తావించింది. ఇంకోవైపు .. ఒంటరి పోరుకు దిగిన విజయ్ కూడా డీఎంకే సారథి, ముఖ్యమంత్రి స్టాలిన్‌ను లక్ష్యంగా చేసుకుని ఎన్నికల పోరు కొనసాగించారు. ఇక, అన్నాడీఎంకే కూడా.. ఇదే రీతిలో ముందుకు సాగినా.. బీజేపీతో పొత్తు వ్యవహారం.. ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందని ఎన్నికలకు ముందే పెద్ద ఎత్తున విశ్లేషణలు వచ్చాయి. అయినప్పటికీ.. అన్నాడీఎంకే కార్యదర్శి.. మాజీ సీఎం పళని స్వామి.. ఐకాన్ నాయకుడిగా నిలిచారు.
ఇక, అన్ని పార్టీలూ ప్రజలపై వరాల వర్షం కురిపించాయి. ఉచిత బస్సు నుంచి ఉచిత విద్యుత్, ఏడాదికి ఆరు వంట గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు.. నెలకు పింఛన్.. నిరుద్యోగ భృతి, ఇల్లు లేని వారికి ఇల్లు.. ఇలా.. వందల కొద్దీ హామీలను కుమ్మరించాయి. ఈ నెల 23న జరిగిన ఎ న్నికలకు సంబంధించి తాజాగా ఎగ్జిట్ పోల్ ఫలితం వచ్చేసింది. అయితే.. సర్వేలు చేసిన అన్ని సంస్థలు కూడా.. డీఎంకే కే పట్టం కట్టాయి. ఆ పార్టీ మరోసారి వరుసగా విజయం దక్కించుకుంటుందని పేర్కొన్నాయి. వచ్చే నెల 4న వాస్తవ ఫలితం వెల్లడికానుంది. సర్వేలు కనుక నిజమైతే.. డీఎంకే వరుసగా రెండోసారి అధికారం దక్కించుకుంటే.. ఆ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి అవుతుంది.
సర్వే రిజల్ట్ ఇదీ..
చాణక్య స్ట్రాటజీస్: డీఎంకే(స్టాలిన్): 145-160, అన్నాడీఎంకే: 50-65, టీవీకే(విజయ్): 13-18
పీపుల్స్ పల్స్: డీఎంకే(స్టాలిన్): 125-145, అన్నాడీఎంకే: 65-80, టీవీకే(విజయ్): 18-24
ప్రజా పోల్: డీఎంకే(స్టాలిన్): 148-168, అన్నాడీఎంకే: 61-81, టీవీకే(విజయ్): 1-9
పల్స్ టుడే: డీఎంకే(స్టాలిన్): 160-170, అన్నాడీఎంకే: 60-70, టీవీకే(విజయ్): 0-8
ఎస్ ఏ ఎస్ గ్రూప్: డీఎంకే(స్టాలిన్): 134-141, అన్నాడీఎంకే: 84-90, టీవీకే(విజయ్): 4-8
This post was last modified on April 29, 2026 8:13 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…