మే 15 విడుదల కావాల్సిన మా ఇంటి బంగారం ఇప్పుడు జూన్ 4 వైపు చూస్తోందనే వార్త పంపిణీ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. టాక్సిక్ ఎలాగూ తప్పుకుంది కాబట్టి ఆ స్లాట్ వాడుకుంటే మంచి రెవిన్యూ వస్తుందనే అభిప్రాయం డిస్ట్రిబ్యూటర్ల నుంచి వ్యక్తం కావడంతో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారని వినికిడి. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ టీమ్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టుగా కనిపిస్తోంది. సరే ఈ డెసిషన్ ఎంత వరకు రైటనేది కొంచెం లోతుగా విశ్లేషిద్దాం.
నిజానికి మా ఇంటి బంగారం ఫిక్స్ చేసుకున్న మే 15 పెద్దగా పోటీ లేదు. సూర్య వీరభద్రుడు కూడా మూడో వారానికి షిఫ్ట్ అవ్వొచ్చని అంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు ఇతరత్రా కారణాల వల్ల ముందు చెప్పిన తేదీకి కట్టుబడలేకపోవచ్చని చెన్నై వర్గాలు ఉటంకిస్తున్నాయి. సో సోలోగా వచ్చే ఛాన్స్ బంగారం మిస్ చేసుకున్నట్టు అవుతుంది. అసలే స్కూల్స్ సెలవులు కొనసాగుతున్నాయి. ఫ్యామిలీస్ కి సమంత మూవీ మంచి ఆప్షన్ అవ్వొచ్చు.
ఇప్పుడు జూన్ 4 కు వద్దాం. టాక్సిక్ అయితే తప్పుకుంది కానీ అక్కడి నుంచి చూసుకుంటే హాలిడేస్ ఇంకొక్క వారం మాత్రమే ఉంటాయి. పిల్లల తల్లితండ్రులు ఫీజులు, అడ్మిషన్లు తదితర హడావిడిలో ఉంటారు. సినిమాల మీద ఎంత ధ్యాస ఉంటుందనేది చెప్పలేం. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే మా ఇంటి బంగారం బయ్యర్లు సెలవులనే కారణంగా చూపించి పోస్ట్ పోన్ అడిగారట. అలాంటప్పుడు మే హాలిడేస్ వృథా చేసుకుంటే ఎలా. జూన్ 4కి ఐపిఎల్ అయిపోవడం బెనిఫిట్టే కానీ క్రికెట్ కోసం ఇరవై రోజులు ఆగిపోవడం సబబు కాదేమో.
ఇంకో ట్విస్టు కూడా ఉంది. పెద్ది జూన్ 25 అని బుచ్చిబాబు మొన్నేదో అనేశాడు కానీ నిజానికి నిర్మాతలు ఇంకా ఫిక్స్ కాలేదు. ఇంకోవైపు లెనిన్ జూన్ 26 లాక్ చేసుకుని నాగార్జున ట్వీట్ ద్వారా మరోసారి కన్ఫర్మ్ చేసుకుంది. ఇదంతా ఎందుకు, మంచి డేట్ మిస్ చేయడం ఎందుకని పెద్ది కనక పొరపాటున జూన్ 4కి వస్తే బంగారంకు చిక్కులు తప్పవు. సరే కంటెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు వచ్చినా ఒకటే కానీ ఈ మూవీ విషయంలో సమంత చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.
This post was last modified on April 29, 2026 7:52 pm
ఒకప్పుడు కలెక్షన్ కింగ్ గా తొంభై దశకంలో స్టార్ హీరోలకు బలమైన పోటీ ఇచ్చిన మోహన్ బాబుకి ఇప్పటికీ ఫాలోయింగ్…
ప్యారడైజ్ సెన్సార్ అయిపోయింది. ఊహించినట్టే ఏ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 54 నిమిషాల సవారి జాతి ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు…
చాలా రోజుల తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనిపించారు. ప్రకృతి వైద్యం కోసం కేరళం వెళ్లి 20 రోజుల…
జపాన్‌తో మ్యాచ్ అంటే టీమిండియా సులభంగా గెలుస్తుందని అనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తడి…
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన మేయర్ స్థానాలపై జనసేన పార్టీ గట్టి పట్టు సాధించాలని వ్యూహరచన చేస్తోంది. కూటమి…
ఓ పెద్ద సినిమా రిలీజవుతుంటే.. అందరూ ఎదురు చూసేది ట్రైలర్ కోసమే. కానీ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న…