Political News

మెగా ఫ్యామిలీ నుంచి ఇంకో నిర్మాత?

టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది హీరోలు, నిర్మాత‌లు మ‌రే ఫ్యామిలీలోనూ లేరు. ఇప్ప‌టికే ఆ కుటుంబంలో ప‌లు నిర్మాణ సంస్థ‌లు ఉన్నాయి. అల్లు అర‌వింద్ ఎప్ప‌ట్నుంచో గీతా ఆర్ట్స్ సంస్థ‌ను న‌డిపిస్తున్నారు. త‌ర్వాత చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల కోసం జీఏ2 పిక్చ‌ర్స్ అంటూ కొత్త బేన‌ర్ పెట్టారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ప్ర‌త్యేకంగా కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్, గోల్డ్ బాక్స్ ఎంట‌ర్టైన్మెంట్ సంస్థ‌లు ఉన్నాయి. అంజ‌నా ప్రొడ‌క్ష‌న్స్‌ నాగ‌బాబుకు చెందిన పాత నిర్మాణ‌ సంస్థ‌. ఆయ‌న వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూ నిహారిక పింక్ ఎలిఫెంట్ పేరుతో కొత్త బేన‌ర్ పెట్టి స‌మ‌ర్థంగా న‌డిస్తోంది. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కేమో ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్ బేన‌ర్ ఉంది. ఇది కాక రామ్ చ‌ర‌ణ్‌.. వీ మెగా సంస్థ పేరు మీద ది ఇండియా హౌస్ సినిమాను నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇలా ఇన్ని ప్రొడ‌క్ష‌న్స్ ఉన్న మెగా ఫ్యామిలీలో కొత్త‌గా ఇంకో బేన‌ర్ పుట్టుకువ‌స్తున్న‌ట్లు స‌మాచారం. ఆ సంస్థ పేరు.. విజ‌య్ దుర్గ ప్రొడ‌క్ష‌న్స్ అట‌. దీన్ని మొద‌లుపెడుతున్న‌ది మెగాస్టార్ మేన‌ల్లుడు, యువ క‌థానాయ‌కుడు సాయిధ‌ర‌మ్ తేజ్ అట‌. త్వ‌ర‌లోనే ఈ సంస్థ‌లో ఒక సినిమా నిర్మితం కాబోతోంద‌ట‌. మ‌రి అందులో తేజునే హీరోగా న‌టిస్తాడా.. లేక యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌డం కోసం ఈ సంస్థ‌ను పెట్టాడా అన్న‌ది తెలియాల్సి ఉంది.

తేజు త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ కూడా హీరోనే కావ‌డంతో త‌మ‌కంటూ ఒక బేన‌ర్ ఉండాల‌ని అన్న‌య్య భావిస్తున్నాడేమో. ప్ర‌స్తుతం తేజు హనుమాన్ నిర్మాత నిరంజ‌న్ రెడ్డితో సంబ‌రాల యేటిగ‌ట్టు అనే భారీ చిత్రం చేస్తున్నాడు. కొత్త ద‌ర్శ‌కుడు కేపీ రోహిత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. భారీ బ‌డ్జెట్లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా సుదీర్ఘ కాలంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. బ‌డ్జెట్ స‌మస్య‌ల ఈ సినిమా రిలీజ్ ఆల‌స్య‌మ‌వుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

This post was last modified on April 22, 2026 9:14 pm

Share

Recent Posts

సైలెంటుగా వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేసింది

నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమ‌మ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన న‌టుడు. ఆ…

3 hours ago

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

7 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

9 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

9 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

10 hours ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

11 hours ago