పునర్విభజన చట్టంలో భాగంగా అసెంబ్లీ స్థానాల్ని గుండుగుత్తగా యాభై శాతం పెంచుతారన్న దానిపై ఎవరికి ఎలాంటి సందేహాల్లేవు. కాకుంటే.. లోక్ సభ స్థానాల సంగతేంటి? 2011 జనాభా లెక్కల్ని ప్రాతిపదికగా తీసుకుంటారా? అలా చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది.
దీనికి తోడు బయటకు వచ్చిన బిల్లులోనూ దీనిపై స్పష్టత లేకపోవటంతో పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ రోజు (గురువారం) ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టే వేళలో.. కేంద్రం పలు అంశాల మీద ఫుల్ క్లారిటీ ఇస్తుందని స్పష్టం చేసినప్పటికి.. అసలేం జరుగుతుందన్న ఉత్కంఠ చాలామందిలో ఉంది. ఇది సామాన్యుల విషయంలోనే కాదు.. పాలకుల విషయంలోనూ.
సరిగ్గా ఇలాంటి సందేహాలే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎదురయ్యాయి. సాదాసీదా జనమైతే.. అంచనాలు.. ఊహాగానాలు..లాజిక్కులతో సరిపెట్టుకుంటారు. కానీ.. ఇలాంటి పరిస్థితే చంద్రబాబుకు ఎదురైతే ఆయన ఎందుకు ఊరుకుంటారు చెప్పండి.
బుధవారం సాయంత్రం సీఎం చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీరాష్ట్ర అధ్యక్షుడు మాధవ్.. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో సుమారు రెండున్నర గంటల పాటు సాగిన సమావేశంలో ఎదురైన సందేహాల్ని అప్పటికప్పుడే తీర్చేసుకోవాలన్న ఆలోచనకు వచ్చిన చంద్రబాబు.. ఆ వెంటనే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు.. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లతో ఫోన్ లో మాట్లాడారు.
పునర్విభజన బిల్లులో లోక్ సభ స్థానాలను 50 శాతం పెంచుతున్నట్లుగా బిల్లులో పొందుపర్చకపోవటం ఏమిటి? దీనిపై నెలకొన్న సందిగ్ధత గురించి ప్రశ్నించగా.. వారు స్పందిస్తూ.. బిల్లులోఅన్ని వివరాలు పొందుపర్చలేమని.. అన్ని రాష్ట్రాల్లో పార్లమెంటు సీట్లు 50 శాతం పెరుగుతాయని ఇద్దరు కేంద్ర మంత్రులు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ బిల్లుపై సభలో చర్చ సందర్భంగా ఈ అంశాన్ని పార్లమెంటు వేధికగా ప్రభుత్వం పేర్కొంటుందన్న అంశంపైనా చంద్రబాబుకు సమాచారం అందింది.
అనంతరం తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రులు.. కిషన్ రెడ్డి.. రామ్మోహన్ నాయుడుతోనూ మాట్లాడారు. కేంద్రమంత్రులతో స్వయంగా మాట్లాడి.. స్పష్టత తీసుకున్న అనంతరం బిల్లుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
50 శాతం నియోజకవర్గాల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని.. దీనిని రాజకీయంగా కలిసికట్టుగా స్వాగతించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్, మాధవ్ ముగ్గురు డిసైడ్ అయ్యారు. చంద్రబాబుకు డౌట్ రావటం మామూలే అయినా.. దానిపై ఆయన ఇన్ స్టెంట్ గా క్లారిటీ తీసుకున్న వైనం.. కోట్లాది మంది తెలుగు వారికి సైతం స్పష్టతను ఇచ్చిందని చెప్పక తప్పదు.
This post was last modified on April 16, 2026 10:56 am
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…