రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే వేరుగా ఉంటుందని చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడే కాదు.. చేతిలో పవర్ లేనప్పుడు కూడా ఏ మాత్రం తగ్గని అతి కొద్ది ఫైర్ బ్రాండ్ నేతల్లో ఆయన ఒకరుగా చెప్పాలి. సందర్భం ఏదైనా.. తాను అనుకున్నదే తప్పించి.. మరే అంశాన్ని పట్టించుకోని మొండితనం ఆయన సొంతం. అధికారంలో లేమన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా వ్యవహరించటమే కాదు.. తనను ఆగ్రహానికి గురి చేసే అధికారి ఎవరినైనా సరే.. అంతు చూసేస్తానంటూ ఓపెన్ గా వార్నింగ్ ఇవ్వటం ఆయనకే చెల్లుతుంది.
తాను చెప్పిందే జరగాలి.. తాను చేసిందే న్యాయం.. చట్టం అన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది. రూల్ బుక్ ఫాలో అవుతానంటే ఆయనకు సుతారం నచ్చదు. రూల్స్ అన్నది తాను డిసైడ్ చేయాలే కానీ.. ఎవరో ఫ్రేం చేసిన రూల్స్ ను తాను ఫాలో కావటం ఏమిటన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటారు. అందుకే.. ఆయన ఎప్పుడైనా ఏదైనా మాట్లాడేస్తారు. మరి.. నోటికి వచ్చినట్లు మాట్లాడితే కేసులు.. అరెస్టులు ఉండవా? అంటే లైట్ తీస్కో బాస్ అన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఆయనపై ఐదారు సందర్భాల్లో కేసులు నమోదు చేశారు. అయినప్పటికి ఆయన్ను అరెస్టు చేసే పరిస్థితులు కూటమి సర్కారులో లేవన్న ప్రచారం సాగుతోంది. ఇందుకు తగ్గట్లే గడిచిన రెండేళ్లలో దాదాపు ఐదారుసార్లు తీవ్రమైన అంశాలపై ఆయనపై కేసులు నమోదు చేసినా..ఇప్పటివరకు చర్యలకు ఆదేశాలు రాని పరిస్థితి. ఎందుకిలా? అంటే ఎవరి వెర్షన్ వారు చెబుతున్నారు.కానీ.. వాస్తవంలో మాత్రం అదేమీ జరగలేదన్న వ్యవహరించే ధోరణి కూటమి సర్కారులో ఎక్కువైందని చెబుతున్నారు.
ఈ కారణంతో పేర్ని నాని లాంటోళ్లు ఏ మాత్రం మొహమాటం పడకుండా.. తమ చేతిలో అధికారాల్ని అదే పనిగా వినియోగిస్తున్న తీరు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
