Political News

ఆ ఒక్క‌టీ తప్ప‌.. జ‌గ‌న్‌కు మోడీ అభ‌యం!?

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు కేంద్రంలోని పెద్ద‌లు స‌హ‌క‌రిస్తున్నార‌నడంలో ఎలాంటి సందేహం లేద‌ని ఢిల్లీ వ‌ర్గాల నుంచి అందుతున్న స‌మ‌చారం. అదేస‌మ‌యంలో రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు కూడా దీనికి బ‌లాన్ని చేకూరుస్తున్నాయి. కీల‌క‌మైన హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి బ‌దిలీ నుంచి అనేక విష‌యాల్లో జ‌గ‌న్‌కు అనుకూల ప‌రిణామాలు జ‌రుగుతుండ‌డాన్ని బ‌ట్టి.. కేంద్రం సంపూర్ణంగా స‌హ‌క‌రిస్తోంద‌నే వాద‌న‌కు బ‌లం చేకూరుతోంది. కొత్త‌ జిల్లాల ఏర్పాటుకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అదేవిధంగా రుణాలు తెచ్చుకునేందుకు(ప‌రిమితికి మించి) కూడా కేంద్రం ఓకే చెప్పింది. అదేవిధంగా ప్రాజెక్టుల విష‌యంలోనూ అనుమ‌తులకు సహ‌క‌రిస్తోంది.

అయితే.. ఇంత చేస్తున్నా.. ఓ కీల‌క విష‌యంలో మాత్రం జ‌గ‌న్ ఆశ‌లు నెర‌వేరే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌న్న‌ది ఢిల్లీ వ‌ర్గాల మాట‌. సీఎం జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో అంచ‌నాల పెంపున‌కు కేంద్రం స‌సేమిరా అంటోంది. 2014లో ప్రాజెక్టు నిర్మాణ వ్య‌యం 27 వేల కోట్లుగా అప్ప‌ట్లో అంచ‌నా వేశారు. త‌ర్వాత దానిని 38 వేల కోట్ల‌కు, ఆ త‌ర్వాత 43 వేల కోట్ల‌కు.. తుదిగా అంటే.. 2018లో 56 వేల కోట్ల‌కు పెంచారు. ఈ విష‌యంలో చివ‌రిగా రూపొందించిన అంచ‌నా వ్య‌యానికి ప‌చ్చ జెండా ఊపాల‌నేది జ‌గ‌న్ డిమాండ్. అయితే.. ఈ విష‌యంలో కేంద్రాన్ని ఆయ‌న డిమాండ్ చేయ‌లేక పోతున్నారు. త‌న‌పై ఉన్న సీబీఐ కేసులు కావొచ్చు.. లేదా మ‌రే ఇత‌ర కార‌ణాలు కావొచ్చు.

ఇటీవ‌ల ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లోనూ ప్ర‌ధాన అజెండా పోల‌వ‌రం అంచ‌నాల‌కు ఆమోద ముద్ర వేయించుకోవ‌డ‌మేన‌నే విష‌యం తెలిసిందే. పైకి చాలా గంభీరంగా తుది అంచ‌నాల‌కు కేంద్రం సానుకూలంగా ఉంద‌ని ప్ర‌చారం చేసుకుంటున్నా.. తాజాగా ఢిల్లీ వ‌ర్గాల నుంచి వ‌స్తున్న క‌థ‌నాల మేర‌కు.. ప్ర‌ధాని మోడీ.. ఈ ఒక్క విష‌యంలో ఎట్టి ప‌రిస్థితిలోనూ స‌హ‌క‌రించే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. బ‌హుశ ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఇటీవ‌ల జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో అప్పాయింట్‌మెంట్ ఇవ్వ‌లేద‌ని అంటున్నారు. అదేవిధంగా ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కూడా ముఖం చాటేయ‌డానికి ఈ ఒక్క‌టే కార‌ణంగా క‌నిపిస్తోంది.

కానీ, రాష్ట్రంలో రాజ‌కీయంగా పుంజుకునేందుకు జ‌గ‌న్‌కు ఉన్న ఏకైక మార్గం పొల‌వ‌రం పూర్తి చేయ‌డం. మూడు రాజ‌ధానులు ఎలాగూ .. ముడిప‌డే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. సో.. పోల‌వ‌రాన్న‌యినా.. పూర్తి చేసి.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప్ర‌జ‌ల ముందుకు వెళ్లాల‌ని ఆయ‌న వ్యూహంగా పెట్టుకున్నారు. కానీ, దీనికి మోడీ మాత్రం ఆ ఒక్క‌టి త‌ప్ప‌! అనే డైలాగును వ‌ల్లెవేస్తున్నారు. ఫ‌లితంగా జ‌గ‌న్‌కు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చందంగా ప‌రిస్థితి మారింద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on December 19, 2020 10:33 am

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

7 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

8 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

9 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

9 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

9 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

10 hours ago