Political News

ఏపీ బ‌డ్జెట్‌: లోకేష్‌- ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌కే ఎక్కువ సొమ్ములు!

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌ల‌కు ఆర్థిక మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ పెద్ద‌పీట వేశారు. వారు చూస్తున్న శాఖ‌ల‌కు అధిక మొత్తంలో సొమ్ములు కేటాయించారు. వాస్త‌వంగా ఏపీ వార్షిక బడ్జెట్ 3,32,205 కోట్ల రూపాయ‌లు కాగా.. దీనిలో 32 వేల 308 కోట్ల రూపాయ‌ల‌ను మంత్రి లోకేష్ సార‌థ్యంలోని పాఠ‌శాల విద్య‌కే కేటాయించారు. దీనివ‌ల్ల గ్రామీణ‌, గిరిజ‌న ప్రాంతాల్లో పాఠ‌శాల విద్య‌కు మెరుగైన సౌక‌ర్యాలు ఏర్ప‌డ‌తాయి.

ఇక‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని పంచాయ‌తీ రాజ్ రాఖ‌కు 22 వేల 941 కోట్ల రూపాయ‌ల ను కేటాయించారు. త‌ద్వారా.. పంచాయ‌తీల ప‌రిధిలో స‌మ‌స్య‌ల ప‌రిష్కారం, గ్రామీణ మౌలిక వ‌స‌తుల‌కు ప్రాధాన్యం పెర‌గ‌నుంది. ఇప్ప‌టికే అభివృద్ధి ద‌శ‌లో ఉన్న‌పంచాయ‌తీ ప్రాజెక్టుల‌కు మ‌రింత ఊతం కూడా ల‌భించ‌నుంది. ముఖ్యంగా గిరిజ‌న ప్రాంతాల్లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌నకు కేంద్రం ఇస్తున్న 90 శాతం నిధుల‌కు రాష్ట్ర గ్రాంటు 10 చొప్పున వెచ్చించే వెసులు బాటు కూడా రానుంది.

ఆ త‌ర్వాత స్థానంలో సాగు, తాగునీటి రంగానికి పెద్ద‌పీట వేశారు. రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ‌కు ఏకంగా 18 వేల 223 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించ‌డం గ‌మ‌నార్హం. గ‌త 2025-26 వార్షిక బ‌డ్జెట్‌తో పోల్చుకుంటే.. ఈ కేటాయింపుల్లో పెద్ద‌గా మార్పు క‌నిపించ‌డం లేదు. గ‌త బ‌డ్జెట్‌లోనే 18 వేల 150 కోట్ల రూపాయ‌లు కేటాయించారు. అదేవిదంగా వైద్య శాఖకు 19 వేల‌, 306 కోట్ల రూపాయ‌లు, వ్యవసాయ శాఖ రూ.11,745 కోట్లు, కీల‌క‌మైన ఇంధన శాఖకు రూ.13,934 కోట్లు కేటాయించారు.

త‌ద్వారా.. ఆయా రంగాల్లో మెరుగైన అభివృద్ధికి ప్ర‌భుత్వం పెద్ద‌పీట వేసింది. ముఖ్యంగా రాష్ట్ర స‌ర్వ‌తో ముఖాభివృద్ధి స్ప‌ష్టంగా క‌నిపించేలా 2026-27 వార్షిక బ‌డ్జెట్‌ను వండి వార్చార‌నే చెప్పాలి. ఇక‌, కేంద్రం నుంచి వ‌చ్చే సొమ్ము విష‌యంలో క్లారిటీ లేదు. ఈ ఏడాది ప్ర‌వేశ పెట్టిన కేంద్ర బ‌డ్జెట్‌లో రాష్ట్రాల‌కు దాదాపు సాయాన్ని ఎత్తివేసిన ప్ర‌భావం ప్ర‌స్తుత బ‌డ్జెట్‌లో క‌నిపించింది. ముఖ్యంగా రాష్ట్రం కీల‌కంగా భావిస్తున్న పోల‌వ‌రం, అమ‌రావ‌తి ప్రాజెక్టుల‌కు కూడా ఈ బ‌డ్జెట్‌లో ఆశించిన మేర‌కు కేటాయింపులు జ‌రిగాయ‌నే చెప్పాలి.

This post was last modified on February 14, 2026 3:40 pm

Share

Recent Posts

ప్రభాస్ సినిమాల లెక్కలన్నీ తారుమారు

కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…

42 minutes ago

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వెళ్లిందా?

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…

1 hour ago

జనసేనకు 50 నుంచి 60.. బొలిశెట్టి వారి లెక్క‌లు!

జ‌న‌సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొంద‌రు నాయ‌కులు త‌మ పంథాను మార్చుకోవ‌డం లేదు.…

3 hours ago

ఢిల్లీ అష్ట‌దిగ్భంధం… ఏంటీ `బ్రిక్స్ స‌ద‌స్సు`?

దేశ రాజ‌ధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు పోలీసుల ప‌హారాలో ఉండ‌నుంది. దాదాపు న‌గ‌రం…

7 hours ago

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

11 hours ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

11 hours ago