పార్టీని బలోపేతం చేయండి.. అని టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపును కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన భూమా అఖిల ప్రియ మరో రూపంలో అర్ధం చేసుకున్నారో.. ఏమో.. ఆమె తనదైన తరహాలో చక్రం తిప్పుతున్నారు. తనను తాను బలోపేతం చేసుకోవడంతోపాటు.. నియోజకవర్గాలను కూడా పంచేసుకున్నారనే టాక్ జోరుగా వినిపిస్తోంది. ఆది నుంచి కూడా అఖిల ప్రియ ఓ విషయం చెబుతున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం తనకు అమ్మ అని.. నంద్యాల నియోజకవర్గం తనకు నాన్నతో సమానమని అనేవారు.
బహుశ.. ఉద్దేశం ఇదే అయినా.. రాజకీయంగా.. ఇలా నియోకవర్గాలను పంచేసుకోవడం.. అనేది ఎంత వరకు సమంజసం.. అనేది టీడీపీ నేతలు అంటున్న మాట. అయినా కూడా భూమా అఖిల ప్రియ మాత్రం దూకుడు ఆపడం లేదు. తన సోదరుడు జగద్విఖ్యాత్ రెడ్డిని రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే నంద్యాలలో జగత్.. తనదైన శైలిలో రాజకీయం చేస్తున్నారు. అక్కతో సమానంగా హాట్ కామెంట్లు పేలుస్తున్నారు. అక్క ఎక్కడ ఉంటే.. తమ్ముడు అక్కడే ఉంటున్నాడు. అంటే.. మొత్తంగా నంద్యాలను జగత్, ఆళ్లగడ్డను అఖిల పంచేసుకున్నారు. అయితే.. ఇది పార్టీలో వ్యతిరేకతకు దారితీస్తోంది.
గత ఎన్నికల్లో అఖిల ఓడిపోయారని.. ఇప్పుడు రెండు నియోజకవర్గాల్లో చక్రం తిప్పుతున్నా.. అధినేత చంద్రబాబు.. చోద్యంచూస్తున్నారని.. ఇలా అయితే.. పార్టీలో ఎంతో మంది వారసులు.. తమ్ముళ్లు-అన్నలు ఉన్నారని.. కాబట్టి.. వారంతా కూడా నియోజకవర్గాలను పంచేసుకుంటే.. మేమెందుకు? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే దీనిపై చంద్రబాబు లేఖలు అందాయి.
అయితే.. ప్రస్తుత పరిస్థితిలో పార్టీ తరఫున ఎంతో కొంత వాయిస్ వినిపిస్తున్నది.. అఖిల ప్రియే కావడం.. సీనియర్లు అందరూ ఇంటికే పరిమితం కావడం.. పార్టీని నిలబెట్టేందుకు ఏ ఒక్కరూ ప్రయత్నించకపోవడం.. వంటి కారణాలతో భూమా కుటుంబం దూకుడుకు చంద్రబాబు అడ్డు చెప్పలేక పోతున్నారనే టాక్ కూడా ఉంది. అయితే.. రెండు నియోజకవర్గాలను అక్కా తమ్ముడు పంచుకోవడంపై మాత్రం నాయకులు గుస్సాగా ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on December 18, 2020 11:19 am
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…