Political News

కాంగ్రెస్ నేత‌ల‌కు రేవంత్ క్లాస్?

తెలంగాణ‌లో జ‌రుగుతున్న మునిసిప‌ల్, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేసేందుకు వీలుగా అధికార కాంగ్రెస్ పార్టీ కొన్ని క‌మిటీల‌ను నియ‌మించింది. మ‌రో నాలుగు రోజుల్లోనే ఈ ప్ర‌చారానికి తెర‌ప‌డ‌నుంది. ఈ నేప‌థ్యానికి తోడు మెజారిటీ మునిసిపాలిటీల్లో కాంగ్రెస్ నేత‌లు.. అసంతృప్తితో ఉన్నారు. త‌మ‌కు అవ‌కాశం చిక్క‌లేద‌ని భావిస్తున్నావారు.. త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అనుకుంటున్న‌వారు.. అల‌క వ‌హిస్తున్నారు.

అయితే.. ఇలాంటి వారిని ముందుగానే గుర్తించి వారిని బుజ్జ‌గించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కానీ.. ఆదిశ‌గా ఇంకా కార్యాచ‌ర‌ణ చేప‌ట్ట‌లేదు. పైగా.. చాలా జిల్లాల్లో ఇంకా నాయ‌కులు ప్ర‌చారాన్ని ముమ్మరం చేయ‌లేదు. కేవ‌లం పోటీలో ఉన్న అభ్య‌ర్థులు మాత్ర‌మే ప్ర‌చారానికి ప‌రిమితం అవుతున్నారు. ఈ విష‌యంపై పార్టీ ఇంటెలిజెన్స్ వ‌ర్గాల‌తో స‌మాచారం తెప్పించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. నాయ‌కుల తీరుపై మండిప‌డిన‌ట్టు తెలిసింది.

“ఇదేం ప‌ద్ధ‌తి.. ఇలా అయితే, గెలుస్తామా? మీరెందుకు మౌనంగా ఉంటున్నారు. బీఆర్ఎస్‌ను ఎందుకు ఎండ‌గ‌ట్ట‌లేక పోతున్నారు.. ఈ ఎన్నిక‌లు అత్యంత కీల‌క‌మ‌ని చెప్పిన త‌ర్వాత కూడా.. ఎందుకు మీరు ఉదాసీనంగా ఉంటున్నారు.“అని ఘాటుగానే కొంద‌రు నాయ‌కుల‌ను ప్ర‌శ్నించారు. ఈ చ‌ర్చ‌ల్లో టీపీసీసీ చీఫ్ నుంచి కూడా కొంత స‌మాచారం రాబ‌ట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏయే జిల్లాల్లో ఇంకా ప్ర‌చారం ముమ్మ‌రం కాలేద‌ని ప్ర‌శ్నించారు.

ఆయా.. అంశాల‌ను సీరియ‌స్‌గా తీసుకున్న రేవంత్ రెడ్డి.. స‌ద‌రు నాయ‌కుల‌కు ఫోన్ చేసి.. హెచ్చ‌రించాల‌ని పార్టీ ప‌రంగా.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లాల్సిందేన‌ని తేల్చి చెప్పిన‌ట్టు స‌మాచారం.

ప్ర‌స్తుతం రేవంత్ రెడ్డి జిల్లాల ప‌ర్య‌ట‌న పెట్టుకుని.. ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ముమ్మ‌రంగా నిర్వ‌హిస్తున్నారు. ఇంత బిజీలోనూ ఆయ‌న రాత్రి 10-12 గంట‌ల మ‌ధ్య ఇంట్లోనే పార్టీ నాయ‌కుల‌తో చ‌ర్చిస్తున్నార‌ని తెలిసిందే. ఎన్నిక‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకోవాల‌ని ఆయ‌న కోరుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌నిచేయ‌ని నాయ‌కుల‌పై ఆయ‌న సీరియ‌స్ అయ్యార‌ని తెలిసింది.

This post was last modified on February 6, 2026 10:01 am

Share

Recent Posts

మరో విమానంలో సీరియస్ సిగ్నల్స్

విమానాలు భయపెడుతున్నాయి. గత వారం ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు కో పైలట్ ప్రయత్నం చేయడం ప్రపంచ వ్యాప్తంగా వార్తయ్యింది.…

7 hours ago

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

10 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

11 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

11 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

13 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

15 hours ago