Political News

అరవ శ్రీధర్ విచారణ పూర్తి… కేసు నమోదు

జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళా ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, అరవ శ్రీధర్ ను సదరు మహిళ పాతిక కోట్ల రూపాయలు డిమాండ్ చేసి బెదిరించిందని ఆరోపణలు వస్తున్నాయి.

ఓ మహిళ మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేసినా అరవ శ్రీధర్ పై కేసు నమోదు చేయలేదని విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎట్టకేలకు అరవ శ్రీధర్ పై కేసు నమోదైంది. తిరుపతి జిల్లా ఎస్పీకి ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.

మరోవైపు, అరవ శ్రీధర్ పై సదరు మహిళ చేసిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు ముగ్గురు జనసేన నేతలతో జనసేన పార్టీ ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆ కమిటీ ముందు అరవ శ్రీధర్ విచారణకు హాజరయ్యారు. రైల్వేకోడూరులోని ఓ హోటల్‌ లో విచారణకు హాజరయ్యారు శ్రీధర్. ఆ ఆరోపణలకు సంబంధించిన వివరాలను కమిటీ సేకరించింది.

అయితే, విచారణ మధ్యలోనే శ్రీధర్‌ బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. విచారణ ముగిసిన తర్వాత మీడియాకు పూర్తి సమాచారం ఇస్తానని చెప్పిన శ్రీధర్..ఆ తర్వాత బయటకు వెళ్తూ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తనపై వచ్చిన ఆరోపణలపై తర్వాత వివరణ ఇస్తానని, తన వివరణను కమిటీకి వివరించానని మీడియాతో శ్రీధర్ అన్నారట.

This post was last modified on February 3, 2026 6:47 pm

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

51 minutes ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

2 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

2 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

2 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

2 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

4 hours ago