Movie News

స్క్రీన్లు.. షోలు… పెంచేశారు!

ఈ వారం మంచి అంచనాల మధ్య రిలీజైన సినిమా.. చెన్నై లవ్ స్టోరీ. ఐతే ప్రి రిలీజ్ బజ్ ఎంత ఉన్నా.. సినిమాకు టాక్ ఎలా ఉందన్నదే ఫలితాన్ని నిర్దేశిస్తుంది. ఐతే శుక్రవారం ఈ సినిమా రిలీజ్ కాగా.. ముందు రోజే మేకర్స్ చాలా కాన్ఫిడెంట్‌గా పెయిడ్ ప్రిమియర్స్ వేశారు. ఆ షోల నుంచి మరీ గొప్ప టాకేమీ రాలేదు. ఎబోవ్ యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకుంది. కొందరు ఈ సినిమాను ఘాటుగా విమర్శించారు కూడా. కొన్ని రివ్యూలు నెగెటివ్‌గానూ వచ్చాయి.

‘బేబి’ తరహాలో ఇందులో సెన్సేషనల్-కాంట్రవర్శల్ కంటెంట్ కూడా లేకపోవడంతో యూత్ ఏమాత్రం రిసీవ్ చేసుకుంటారో అన్న అనుమానాలు కూడా కలిగాయి. కానీ ‘చెన్నై లవ్ స్టోరీ’ ఈ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసేసింది. తొలి రోజు నిలకడగా వసూళ్లు రాబట్టి ఆశ్చర్యపరిచింది. అంతకంటే ఆశ్చర్యం ఏంటంటే.. రెండో రోజు వసూళ్లు డ్రాప్ కాకపోగా, ఇంకా మెరుగ్గా వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్లతో సినిమా రన్ అయింది.

రిలీజ్ రోజుతో పోలిస్తే.. రెండో రోజు ‘చెన్నై లవ్ స్టోరీ’కి షోలు, స్క్రీన్లు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ సినిమాకు పోటీగా రిలీజైన తమిళ అనువాద చిత్రం ‘జననాయకుడు’కు గురువారం భారీగా స్క్రీన్లు ఇచ్చారు. శుక్రవారం కూడా ఆ సినిమాకు ఆ స్క్రీన్లు, షోలు కొనసాగాయి. కానీ తెలుగులో విజయ్ చిత్రానికి బాగా బ్యాడ్ టాక్ రావడం, వసూళ్లు రెండో రోజుకు బాగా పడిపోవడంతో అన్నేసి స్క్రీన్లు, షోలు దానికి కొనసాగించడం వేస్ట్ అని అర్థమైంది.

దీంతో శనివారం మల్టీప్లెక్సులన్నీ ‘జననాయకుడు’కు స్క్రీన్లు, షోలు బాగా తగ్గించేశాయి. వాటన్నింటినీ ‘చెన్నై లవ్ స్టోరీ’కి మళ్లించేశాయి. రిలీజ్ రోజు ఉదయంతో పోలిస్తే నిన్న రాత్రికి ‘చెన్నై లవ్ స్టోరీ’కి పెరిగిన షోలు 200 పైగానే ఉండడం విశేషం. దీన్ని బట్టే సినిమాకు ఎలాంటి డిమాండ్ ఉందన్నది అర్థం చేసుకోవచ్చు. ఆదివారం కూడా సినిమాకు ఆక్యుపెన్సీలు చాలా బాగున్నాయి. ఈవెనింగ్, నైట్ షోలు ప్యాక్డ్ హౌస్‌లతో నడవబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

This post was last modified on July 26, 2026 12:32 pm

Share

Recent Posts

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

2 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

4 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

4 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

6 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

7 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

8 hours ago