క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఇక్కడ సీట్లంటే మొన్నటి అసెంబ్లీలో తెలుగుదేశంపార్టీ గెలుచుకున్న ఎంఎల్ఏ సీట్లు కాదులేండి. అప్పుడెప్పుడో టీడీపీ హయాంలో జరిగిన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పైన ఇఫుడు వైసీపీ గురిపెట్టిందట. 2017లో జరిగిన కాకినడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. 50 డివిజిన్లకు గాను 48 డివిజన్లలోనే ఎన్నికలు జరిగాయి. కోర్టు వివాదాల కారణంగా రెండు డివిజన్లలో ఎన్నికలు జరగలేదు.
జరిగిన ఎన్నికలో టీడీపీ 32 డివిజన్లలో గెలిచింది. వైసీపీ 10, బీజేపీ, ఇండిపెండెంట్లు చెరో మూడు డివిజన్లలో గెలిచారు. అత్యధిక డివిజన్లలో గెలిచిన కారణంగా టీడీపీ నేత సుంకరపావని మేయర్ అయ్యారు. వైసీపీ తరపున గెలిచిన 10 మంది కార్పొరేటర్లను పార్టీ మారేట్లుగా అప్పట్లోనే టీడీపీ ఓ రేంజిలో ఒత్తిడి తెచ్చింది. అయినా వాళ్ళెవరు టీడీపీ కండువాలు కప్పుకోవటానికి ఇష్టపడలేదు.
కాలం గిర్రున తిరిగి మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దాంతో కాకినాడ అధికారపార్టీ ఎంఎల్ఏ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చక్రం తిప్పటం మొదలుపెట్టారు. తమ పార్టీ అధికారంలోకి రావటంతో కార్పొరేటర్లది ఇపుడు పైచేయి అయ్యింది. దాంతో మేయర్+టీడీపీ కార్పొరేటర్లు డమ్మీలైపోయారట. ప్రభుత్వం మారిపోగానే ఇపుడు టీడీపీ మేయర్, కార్పొరేటర్లలో అభద్రత మొదలైనట్లు సమాచారం.
ఇంకా మూడున్నరేళ్ళు అధికారంలో ఉండబోయే వైసీపీతో గొడవలెందుకున్న ఉద్దేశ్యంతో చాలామంది పార్టీ మారిపోవటానికి రెడీ అయిపోయారని సమాచారం. టీడీపీ తరపున గెలిచిన 32 మందిలో ఓ 25 మంది కార్పొరేటర్లు వైసీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అయిపోయారట. ఇదే గనుక నిజంగా జరిగితే టీడీపీ 25 మంది కొర్పొరేటర్లు + అధికారపార్టీ 10 మంది కార్పొరేటర్లు కలుపుకుంటే మేయర్ పీఠం వైసీపీదే అవుతుంది. దీన్ని అడ్డుకునేందుకు టీడీపీ సీనియర్లు ప్రయత్నాలు మొదలుపెట్టారట.
అయితే అది సాధ్యమవుతుందా ? ఎందుకంటే పార్టీ ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి చాలామంది సీనియర్ నేతలు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. పైగా తాము అధికారంలో ఉన్నపుడు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు గురిచేసి వైసీపీ వాళ్ళని టీడీపీ లొంగదీసుకుంది. ఇపుడు అదే దారిలో వైసీపీ వెళుతోందంతే. కాబట్టి చూస్తుండటం కన్నా టీడీపీ చేయగలిగింది లేదు.
This post was last modified on December 17, 2020 10:21 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…