నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత ప్రజలందరూ ఎదురుచూశారు. కానీ వాటన్నిటికీ చెక్ పెడుతూ ఒంటరి పోరాటానికే విజయ్ మొగ్గు చూపడంతో పొత్తు ప్రస్తావనే ఇక రావట్లేదు.
ఇప్పుడు ఏకంగా తానే కింగ్ అవుతానంటూ దళపతి చేసిన వ్యాఖలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కింగ్ మేకర్ అంటూ ప్రస్తావన రావడంతో నేను కింగ్ మేకర్ కాదు నేను కింగ్… ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మా పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చెయ్యడం తమిళనాట రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.
ప్రస్తుత పరిస్థితుల్లో విజయ్ డబుల్ డిజిట్ సీట్లు గెలిచినా అది పెద్ద విజయం కిందకే వస్తుంది. కానీ ఎవరితో పొత్తు లేకుండా ఒంటరి పోరాటంతోనే సీఎం అవుతానంటున్న విజయ్ రెండు అతిపెద్ద కూటములను ఎలా ఎదురుకుంటాడో అనే సందేహం కలగక మానదు.
తమిళనాట రాజకీయాల్లోనే అతి పెద్ద క్లిష్టమైన ఎన్నికల్లో విజయ్ ఒంటరిపోరటం కత్తిమీద సాము లాంటిది. ఏదో ఒక కూటమితో కలిస్తేనే ప్రారంభదశలో పార్టీకి స్పష్టమైన బలం చేకూరుతుంది. అలా కాదని ఒంటరి పోరాటం చెయ్యడం కేవలం తనకి మాత్రమే కాదు, తనని నమ్మి పార్టీలో చేరిన వాళ్ళందరికీ రిస్క్ అనడంలో సందేహం లేదు.
ఒకవేల ఎన్నికల్లో ప్రజల నుండి బలమైన మద్దతు దక్కి, మంచి సీట్లు గెలుచుకుంటే మాత్రం పార్టీకి మరికొంత బలం దొరికినట్టు అవుతుంది. మరి ప్రజలు విజయ్ కి అతని పార్టీకి ఎంతమేరకు మద్దతు ఇస్తారో చూడాలి.
This post was last modified on January 31, 2026 9:20 am
స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…
కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…