ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ షర్మిల.. రాజ్యసభకు వెళ్తారంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. 2024 ఫిబ్రవరిలో ఆమె ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేపట్టారు. అనంతరం.. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో కడప నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. తన సోదరుడు, వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వం దిగిపోవడంలో షర్మిల కీలక పాత్ర పోషించారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తారు. అప్పట్లో ఊరూ వాడా తిరిగి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యతో పాటు ఆస్తుల వివాదాలను కూడా ఆమె ప్రచారం చేశారు.
ఈ క్రమంలోనే కీలకమైన ఓటు బ్యాంకు వైసీపీకి దూరమైందన్న చర్చ ఉంది. ఇదిలావుంటే.. షర్మిల ఆనాటి ఎన్నికల్లో కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా 128 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపినా.. ఒక్కరూ విజయం దక్కించుకోలేక పోయారు. ఇక, ఆ తర్వాత.. తరచుగా ఏపీ సమస్యలు, ముఖ్యంగా సోదరుడు జగన్‌పైనా విమర్శలు గుప్పించడం వరకు షర్మిల పరిమితం అవుతున్నారు. ఇదిలావుంటే.. పార్టీ సీనియర్ల నుంచి ఆమెకు సెగ తగులుతోంది.
కాంగ్రెస్ పార్టీ లైన్‌కు భిన్నంగా వ్యవహరిస్తున్నారని.. ఆమెను అధ్యక్ష పదవి నుంచి తప్పించాలన్న డిమాండ్లు కూడా తెరమీదికి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే.. షర్మిలకు గతంలో అంటే.. 2024లోనే కడప ఎంపీగా పోటీకి దిగినప్పుడు.. ఓడితే రాజ్యసభకు పంపిస్తామని.. కాంగ్రెస్ అధిష్టానం భరోసా కల్పించిందన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ క్రమంలోనే ఆమెను రాజ్యసభకు పంపిస్తున్నారని ఢిల్లీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా మంగళవారం రాహుల్‌గాంధీ నుంచి వచ్చిన పిలుపు మేరకు.. షర్మిల హుటాహుటిన ఢిల్లికి వెళ్లి ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు.
త్వరలోనే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లోనూ ఖాళీ అవుతున్నా.. అక్కడ కాంగ్రెస్‌కు బలం లేదు. ఈ నేపథ్యంలో కర్ణాటక, లేదా తెలంగాణ కోటా నుంచి షర్మిలను పెద్దల సభకు పంపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. అనంతరం.. ఏపీకి సంబంధించి ఓ కీలక కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ అధికారికి కాంగ్రెస్ పగ్గాలు అప్పగించనున్నారని తెలుస్తోంది. ఆయన గతంలోనే సొంత పార్టీ పెట్టుకున్నారు. అయితే.. అది సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. ఏపీ కాంగ్రెస్ పగ్గాల కోసం ప్రయత్నిస్తున్నారు.
This post was last modified on January 27, 2026 9:27 pm
పవన్ కళ్యాణ్ వారసుడిగా స్క్రీన్ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్న అకీరానందన్ ఇంకా ఇండస్ట్రీకి రాకముందే హాట్ టాపిక్…
గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్టీ కార్యకర్తలు, నాయకుల కోసం శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ…
టాలీవుడ్ లోనే కాదు అటు బాలీవుడ్ లోనూ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న స్పిరిట్ మీద పుకార్ల ప్రహసనం మాములుగా…
సింగరేణి బొగ్గు స్కాం ఆరోపణలు, ఆ నేపథ్యంలో మీడియాలో రకరకాల కథనాలు, కాంగ్రెస్ కీలక నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలపై…
సింగరేణి బొగ్గు స్కామ్ ఆరోపణలు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే నైనీ కోల్ బ్లాక్ కోసం…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేలా పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా బిల్లు ప్రవేశపెట్టబోతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించిన…