Political News

భారీగా త‌గ్గ‌నున్న కార్లు-దుస్తుల ధ‌ర‌లు

యూరోపియ‌న్ దేశాలుగా పేరొందిన జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్‌, ఇటలీ, బ్రిట‌న్‌, స్విట్జ‌ర్లాండ్‌, నార్వే, స్పెయిన్‌, ఉక్రెయిన్‌, పోలాండ్ స‌హా 25 దేశాల నుంచి భార‌త్‌కు దిగుమ‌తి అయ్యే అన్ని ర‌కాల వ‌స్తువుల ధ‌ర‌లు భారీగా త‌గ్గుముఖం ప‌ట్ట‌నున్నాయి. గ‌త ప‌దేళ్ల‌లో ఆయా దేశాలు.. 90 శాతం మేర‌కు భార‌త్‌కు ఎగుమ‌తులు చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు అమెరికా అండతో .. ఆయా దేశాలు విచ్చ‌ల‌విడిగా.. వ‌స్తువుల ధ‌ర‌లు పెంచాయి.

కానీ, ఇప్పుడు ప్ర‌పంచ దేశాల‌కు ట్రంప్ సెగ బాగా త‌గులుతున్న నేప‌థ్యంలో యూరోపియ‌న్ దేశాలు దిగి వ‌చ్చాయి. బార‌త్ వంటి అతి పెద్ద మార్కెట్‌ను కోల్పోకుండా.. తాజాగా అతి పెద్ద ఒప్పందం చేసుకున్నా యి. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ సార‌థ్యంలో జ‌రిగిన ఈ కీల‌క ఒప్పందం ప్ర‌కారం.. యూరోపియన్  దేశాల నుంచి భార‌త్‌కు దిగుమతి అయ్యే.. కార్లు, దుస్తులు, మేస్ మెట‌ల్‌(ముడి ప‌దార్థాలు), మిష‌న‌రీ, ర‌వాణా వాహ‌నాల్లో వినియోగించే ప‌రిక‌రాలు.. ఇలా అన్ని ధ‌ర‌లు భారీగా త‌గ్గుముఖం ప‌ట్ట‌నున్నాయి.

యూరోపియ‌న్ యూనియ‌న్‌తో ఈ మేర‌కు ఒప్పందం కుదిరిన‌ట్టు స్వ‌యంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. భార‌త్‌-ఈయూ దేశాల మ‌ధ్య‌కుదిరిన ఈ ఒప్పందాన్ని.. “ఒప్పం దాల్లో కెల్లా త‌ల్లి వంటిది“ అని  ప్రపంచ దేశాలు కొనియాడుతున్న‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు.

ఈ ఒప్పందం ఫ‌లితంగా.. భార‌త్ స‌హా ఐరోపా దేశాల‌కు మేలు జ‌రుగుతుంద‌ని.. ముఖ్యంగా ప్ర‌జ‌ల‌కు దైనందిన అవ‌స‌రాల‌కు వినియోగించే వ‌స్తువుల ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయ‌ని వివ‌రించారు.

This post was last modified on January 27, 2026 4:37 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సంక్రాంతి హ్యాంగోవర్ నుంచి బయటికొస్తారా?

కొత్త ఏడాది ఆరంభమవుతుంటే.. తెలుగు ప్రేక్షకుల దృష్టంతా సంక్రాంతి మీదే ఉంటుంది. ఆ పండక్కి భారీ చిత్రాలు, ఎక్కువ సంఖ్యలో…

38 minutes ago

మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా

తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. కొద్ది రోజులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్…

49 minutes ago

నేను చిక్కిపోయింది అందుకేరా నాయనా: లోకేశ్

టీడీపీ కీలక నేత, మంత్రి లోకేశ్ గతంలో పోలిస్తే ఇప్పుడు చాలా సన్నబడ్డారు. దీంతో, లోకేశ్ పక్కాగా డైట్ మెయింటైన్…

1 hour ago

గాంధీ టాక్స్… నిశ్శబ్దం చేయించే యుద్ధం

మాటలు లేకుండా సినిమాను ఊహించుకోవడం కష్టం. డైలాగులు పెట్టకుండా కేవలం సీన్స్ తో కన్విన్స్ చేయడం అసాధ్యం కాబట్టి దర్శక…

1 hour ago

‘గద్దర్ అన్నను గేటు బయట నిలబెట్టింది ఆయనే’

ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజ్యసభ మాజీ సభ్యుడు, బీఆర్ ఎస్ నేత జోగినిపల్లి సంతోష్ రావు ఈ రోజు సిట్…

4 hours ago

ఇంటికి త్వరగా వస్తున్న అన్నగారు

మొన్న పొంగల్ పండక్కు విడుదలైన కార్తీ వా వాతియార్ బాక్సాఫీస్ వద్ద చేదు ఫలితాన్ని చవి చూసింది. జన నాయకుడు…

5 hours ago