Political News

హిందీ భాషపై డిప్యూటీ సీఎం షాకింగ్ కామెంట్స్

తమిళనాడులో రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అందరూ హిందీ భాషను బలవంతంగా కేంద్రం తమ ప్రజలపై రుద్దాలని చూస్తోందని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగనివ్వబోమని తమిళనాడు సీఎం స్టాలిన్ తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే ఇదే విషయాన్ని ఆయన తనయుడు, తమిళనాడు డిప్యూటీ సీఎం, కోలీవుడ్ హీరో ఉదయనిధి స్టాలిన్ మరోసారి స్పష్టం చేశారు.

తమిళనాడుపై హిందీని రుద్దే ప్రయత్నాలను ఒప్పుకునే ప్రసక్తే లేదని ఉదయనిధి స్టాలిన్ చెప్పారు.1960లలో హిందీ వ్యతిరేక ఆందోళనల్లో అమరులైన తమిళులకు ఆయన నివాళులర్పించారు. ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో హిందీని బలవంతంగా రుద్దారని, ఆ క్రమంలోనే హర్యాన్వీ, భోజ్ పురి, బిహారీ, ఛత్తీస్గఢీ వంటి మాతృభాషలు ఆయా రాష్ట్రాల్లో కనుమరుగయ్యాయని విమర్శించారు. ప్రాంతీయ గుర్తింపు, సాంస్కృతిక వారసత్వాన్ని హిందీ భాష నాశనం చేస్తుందనేందుకు ఇదే నిదర్శనమని చెప్పారు. తమిళనాడులో ఆ విధంగా జరగనివ్వబోమని తేల్చి చెెప్పారు.

కాగా, బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఉదయనిధి స్టాలిన్ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. డెంగ్యూ, దోమలు, మలేరియా, కోవిడ్-19 వంటి వాటిని వ్యతిరేకించలేమని, వాటిని నిర్మూలించాలని ఆయన అన్నారు. అదేవిధంగా, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే బదులు, మనం దానిని నిర్మూలించాలని ఉదయనిధి చేసిన కామెంట్లపై హిందూ సంఘాల నేతలు, బీజేపీ నేతలు మండిపడ్డారు. ఆ తర్వాత ఉదయనిధిపై కేసు నమోదైంది.

ఆ క్రమంలోనే ఈ ఏడాది జనవరి 21న ఆ కేసును విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు….ఉదయనిధి చేసిన వివాదాస్పద ప్రకటన ద్వేషపూరిత ప్రసంగమని అంగీకరించింది.  ఆ వ్యాఖ్యల నేపథ్యంలో ఉదయనిధి ఇప్పటికే చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరికొద్ది నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ కేసు ఉదయనిధికి చిక్కులు తెచ్చేలా కనిపిస్తోంది.

This post was last modified on January 26, 2026 10:10 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

హీరోని చూసి జాలిప‌డ్డ త‌ల్లి

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి హీరోగా ఒక స్థాయి తెచ్చుకున్న న‌టుడు విశ్వ‌క్సేన్‌. తొలి సినిమా వెళ్ళిపోమాకేలో…

5 hours ago

హీరోయిన్ని నిజంగానే చెంప‌దెబ్బ కొట్టిన హీరో

ఒక స‌న్నివేశం మ‌రింత‌ ప్ర‌భావ‌వంతంగా ఉండేందుకు.. ఎమోష‌న్ బాగా పండ‌డం కోసం.. ఆర్టిస్టులు పాత్ర‌ల్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయి నిజంగానే…

7 hours ago

యాటిట్యూడ్ స్టార్… ఇంకా తగ్గలేదుగా

తెలుగులో చాలామంది స్టార్లు ఉన్నారు. వారికి ర‌క‌ర‌కాల ట్యాగ్స్ ఉన్నాయి. కానీ యాటిట్యూడ్ స్టార్ అని ఒక ట్యాగ్ పెట్టుకుని…

9 hours ago

థియేటర్లో హిట్టు కొట్టాక ఆది తగ్గుతాడా

‘శంబాల’కు ముందు ఆది సాయికుమార్ ఎప్పుడు హిట్టు కొట్టాడో కూడా ప్రేక్షకులకు గుర్తు లేదు. కెరీర్ ఆరంభంలో ప్రేమకావాలి, లవ్లీ సినిమాలతో ఆకట్టుకున్న…

10 hours ago

బ్రిటిష్ రక్తపుటేరుల్లో ‘రణబాలి’ తిరుగుబాటు

వరస ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈసారి పూర్తిగా రూటు మార్చి పీరియాడిక్ సెటప్స్ వైపు…

10 hours ago

ఫోన్ ట్యాపింగ్ కేసు… ఇప్పుడు ఈయన వంతు

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మాజీ మంత్రులు, బీఆర్ఎస్ కీలక నేతలు హరీశ్ రావు, కేటీఆర్ లను సిట్…

14 hours ago