ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర యోగా, నేచురోపతి విభాగం ప్రభుత్వ సలహాదారుగా ప్రముఖ యోగా, ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజును నియమించింది. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఈ నియామకం క్యాబినెట్ హోదాతో కూడిన పదవి కావడంతో జీతభత్యాలు, ప్రభుత్వ సదుపాయాలు లభించే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు ఈ బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ మంతెన, అయితే మొదటి నుంచే నిరాడంబర జీవన విధానాన్ని అనుసరిస్తూ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు.
క్యాబినెట్ హోదాతో వచ్చే ఎలాంటి జీతం, భత్యాలు, ప్రభుత్వ వాహనం, కార్యాలయ సదుపాయాలు, ప్రయాణ టిక్కెట్లు, సిబ్బంది ఖర్చులు వంటి సౌకర్యాలను స్వీకరించబోనని ఆయన స్పష్టం చేశారు.
ప్రజల సొమ్ము తీసుకోవడం తన సిద్ధాంతాలకు విరుద్ధమని, గత 35 ఏళ్లుగా ఎవరి నుంచీ రూపాయి గానీ, బహుమతి గానీ తీసుకోలేదని ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బు ప్రజలదేనని, అలాంటి ధనాన్ని స్వీకరించడం తాను చేసిన పాపంగా భావిస్తానని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ షరతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించినట్లు తెలిపారు.
ఇటీవల ఈ నియామకం గురించి మాట్లాడిన డాక్టర్ మంతెన, తొలుత ఈ పదవిని స్వీకరించడానికి సిద్ధంగా లేనని వెల్లడించారు. వ్యక్తిగత నియమాలకు విరుద్ధమని భావించి, కేవలం వెనకుండి ప్రభుత్వానికి అవసరమైన సలహాలు మాత్రమే ఇస్తానని ప్రతిపాదించినట్లు తెలిపారు.
అయినప్పటికీ ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ముఖ్యమంత్రి అభ్యర్థనను గౌరవిస్తూ సలహాదారుగా కొనసాగేందుకు అంగీకరించినట్లు చెప్పారు. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చకు దారి తీసింది.
This post was last modified on January 26, 2026 2:09 pm
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…