నిబద్ధతతో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది ఉంటారు. విధి నిర్వహణలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా పనిచేసి ఇటు ప్రజల..అటు ప్రభుత్వ మన్ననలు పొందుతుంటారు. ఇక, మరికొందరైతే తాము విధి నిర్వహణలో లేకపోయినా పరిస్థితిని బట్టి విధులు నిర్వర్తించి ప్రత్యేకమైన ప్రశంసలతో పాటు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటారు.
మహిళా కానిస్టేబుల్ జయశాంతి ఆ కోవలోకే వస్తారు. అందుకే, ఆమెను ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి అనిత చీరసారెలతో ప్రత్యేకంగా సత్కరించారు. అంతేకాదు, ఆమెతో కలిసి భోజనం చేశారు.
సంక్రాంతి సమయంలో కాకినాడ కెనాల్ రోడ్డులో చంటిబిడ్డను ఎత్తుకొని మరీ ట్రాఫిక్ క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్ జయశాంతి వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన జయశాంతి డ్యూటీలో లేకపోయినా చంటిబిడ్డను ఎత్తుకొని మరీ ట్రాఫిక్ క్లియర్ చేశారు.
ఐదారు కిలోమీటర్ల మేర జామ్ అయిన ట్రాఫిక్ ను క్లియర్ చేసే క్రమంలో అంబులెన్స్ కు దారి ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న హోం మినిస్టర్ అనిత… జయశాంతిని ఫోన్ లో అభినందించారు.
ఆ సమయంలో అనితను కలవాలని ఉందంటూ మనసులో మాట చెప్పారు జయశాంతి. దీంతో, ఈ రోజు విజయవాడ క్యాంప్ కార్యాలయంలో జయశాంతిని అనిత సత్కరించారు. జయశాంతితో కలిసి భోజనం కూడా చేశారు.
అంతేకాదు, జయశాంతికి బొట్టు పెట్టి చీరసారెలతో సాగనంపారు. ఆమె భర్తకు కూడా నూతన వస్త్రాలను బహూకరించారు. ఈ విషయాన్ని స్వయంగా అనిత తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మన రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతి పోలీసు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని అనిత చెప్పారు.
This post was last modified on January 22, 2026 4:23 pm
సోషల్ మీడియాలో సక్సెస్ అవ్వడానికి వయసుతో సంబంధం లేదని ఉత్తర ప్రదేశ్కు చెందిన వినోద్ కుమార్ శర్మ నిరూపించారు. 70…
పార్టీ అధినేత మనసులో ఉన్న మాటే.. నాయకులూ చెబుతున్నారా..? వైసీపీలో వలంటీర్ల విషయంలో తమ వైఖరిని తేల్చేసిందా..? ఈ రోజు…
బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన ఆమిర్ ఖాన్కు ఇప్పటికే రెండుసార్లు పెళ్లవడం.. ఆ ఇద్దరి నుంచి విడాకులు తీసుకోవడం తెలిసిందే.…
జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారత సైనికులు ప్రయాణిస్తున్న వాహనం నియంత్రణ కోల్పోయి…
రేపు బాలీవుడ్ మల్టీస్టారర్ బోర్డర్ 2 విడుదల కానుంది. 1997లో వచ్చిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ కొనసాగింపుగా రూపొందిన…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే.…