సొంత పార్టీ పెట్టుకుంటానని ప్రకటించిన బీఆర్ ఎస్ మాజీ నాయకురాలు, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత.. తన పార్టీకి సంబంధించిన పనిని ప్రారంభించేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఇదేసమయంలో పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకువెళ్లాలి.. ఎలాంటి అడుగులు వేయాలి… ప్రజల నాడి ఎలా ఉంది? అనే అంశాలపై రాజకీయ మాజీ వ్యూహకర్త.. ప్రశాంత్ కిషోర్ నుంచి ఆమె సలహాలు తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు వీరి మధ్యచర్చలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. తెలంగాణ అస్తిత్వాన్ని, ప్రజల సెంటిమెంటును తన రాజకీయపార్టీకి ప్రధాన పునాదులుగా భావిస్తున్న కవిత.. వాటినే ఇప్పుడు ఆలంబనగా చేసుకుని వ్యూహాత్మక అడుగులు వేసే ప్రయత్నంలో ఉన్నారు. ముఖ్యంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని క్షేత్రస్థాయిలో పుంజుకునేలా చేయాలన్నది ఆమె ప్రధాన సంకల్పంగా ఉంది. కానీ, ప్రస్తుతం ఆమె వ్యక్తిగతంగా ఇమేజ్ కంటే కూడా.. కేసీఆర్‌కుమార్తెగానే గుర్తింపు తెచ్చుకున్నారు.
గ్రామాల్లో అయినా.. నగరాల్లో అయినా.. కవితకు ఉన్న ఏకైక గుర్తింపు కేసీఆర్. ఆయన కుమార్తె గానే తెలంగాణ సమాజం ఆమెను ఆదరిస్తోంది. అయితే.. రేపు పార్టీ పెట్టుకున్నాక కూడా ఇదే గుర్తింపు కొనసాగించాలని ఆమెకోరుకోవడం లేదు. ఇప్పటికే జెండా సహా .. పేరులోనూ కేసీఆర్‌ను తీసేశారు. తెలంగాణ జాగృతి సంస్థనే పార్టీగా మార్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే పీకేతో ఆమె సంప్రదింపులు చేస్తున్నారు. అయితే.. పీకే ఎలాంటి సలహాలు ఇస్తారు.. అనేది చూడాలి.
విఫల నేత!
ఇక, ప్రశాంతి కిషోర్.. వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆయన విఫలనాయకుడిగా పేరొందారు. బీహార్‌లో ఆయన పార్టీ పెట్టి.. పాదయాత్ర చేశారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కనీసంలో కనీసం 50 స్థానాల్లో విజయం దక్కించుకుంటానని చెప్పారు. కానీ, సాధించలేక పోయారు. పైగా.. ఎవరూ డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయారు. ఇలాంటి నేపథ్యంలో విఫల నేతతో కవిత ప్రయాణం అనే చర్చ కూడా సాగుతోంది. ఇది ఏమేరకు ఆమెకు ప్లస్ అవుతుంది? మైనస్ అవుతుంది? అనేది కూడా చూడాలి.
This post was last modified on January 19, 2026 3:02 pm
మెగా అభిమానులు కొన్నేళ్ల నుంచి అంత సంతృప్తిగా లేరు. చిరు నుంచి ‘భోళా శంకర్’ లాంటి భారీ డిజాస్టర్ వచ్చింది.…
ఈ రోజుల్లో, బస్ స్టాప్, ప్రేమకథా చిత్రమ్ లాంటి చిన్న సినిమాలతో సంచలనం సృష్టించి.. ఆపై నానితో చేసిన ‘భలే…
తెలంగాణ ముఖ్యమంత్రిగా నిత్యం ఎంతో బిజీగా ఉండే రేవంత్ రెడ్డి..పుస్తకాలు పట్టుకుని స్టూడెంట్ గా మారనున్నారు. నిజానికి తనకు ఒక్కరోజు…
వీధి శునకాలను అకారణంగా చంపుతున్నారని నటి రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబడుతూ…
మార్చిలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 కోసం క్రికెట్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తుండగా, ఈ మెగా టోర్నీపై తరచుగా వచ్చే…
తెలుగు సినీ పరిశ్రమకు ఎప్పట్నుంచో హైదరాబాద్ కేంద్రంగా ఉంటోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక కూడా ఇండస్ట్రీకి హైదరాబాదే…